సర్‌‌ప్రైజ్ చేసేలా మామా మశ్చీంద్ర

సర్‌‌ప్రైజ్ చేసేలా మామా మశ్చీంద్ర

సుధీర్ బాబు హీరోగా హర్షవర్ధన్ తెరకెక్కించిన చిత్రం ‘మామా మశ్చీంద్ర’. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు  నిర్మించారు. ఈ మూవీ ట్రైలర్‌‌‌‌ను మహేష్‌‌ బాబు విడుదల చేసి బెస్ట్ విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌‌మీట్‌‌లో సుధీర్ బాబు మాట్లాడుతూ ‘నా కెరీర్‌‌‌‌లో వైవిధ్యమైన సినిమా ఇది. నేను పోషించిన మూడు పాత్రలకు అందరూ కనెక్ట్ అవుతారు.  కొత్తగా తీశారని ఫీల్‌‌ అవుతారు’ అని చెప్పాడు. 

‘ప్రతి సీన్‌‌లో ఒక మలుపు, సర్‌‌ప్రైజ్ ఉంటుంది’ అన్నాడు హర్షవర్ధన్. నిర్మాత రామ్ మోహన్ మాట్లాడుతూ ‘చాలా డిఫరెంట్ మూవీ.  మామా అల్లుళ్ళ మధ్య వచ్చే మలుపులు ఎన్నడూ చూడని విధంగా వుంటాయి. అక్టోబర్ 6న సినిమాను విడుదల చేస్తున్నాం’ అన్నారు.