SalaarBookMyShow : సలార్ దెబ్బకు..బుక్మై షో యాప్ క్రాష్..ఇది నిజమేనా!

SalaarBookMyShow : సలార్ దెబ్బకు..బుక్మై షో యాప్ క్రాష్..ఇది నిజమేనా!

డార్లింగ్ ప్రభాస్ ఏ సినిమాకు రాని పిచ్చ క్రేజ్..సలార్ సినిమాకి వస్తోంది. తమ అభిమాన నటుడిని ఎలా చూడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారో..అలానే ప్రభాస్ కనిపిస్తుండటంతో హంగామా మామూలు రేంజ్లో లేదు.

ఇదిలా ఉంచితే..సలార్ సినిమా మరో రెండ్రోజుల్లో రిలీజ్ అవుతుండటంతో టికెట్ల పోరాటం నడుస్తోంది. రిలీజ్కు ఐదు రోజుల ముందే హిందీ, కన్నడ, తమిళ భాషలలో సలార్ సినిమాకి బుక్మై షోలో (BookMyShow) అడ్వాన్స్ బుకింగ్స్ షురూ అయ్యాయి. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం నిన్నటి వరకి ఓపెన్ కాలేదు.ఇందుకు కారణం లేకపోలేదు.

బెన్ ఫిట్ షోస్, స్పెషల్ షోస్, టికెట్ రేట్స్ అనుమతి కోసం నిర్మాతలు రెండు ప్రభుత్వాలకి అప్లై చేసుకున్నారు.ఇక నిన్నసాయంత్రం రెండు ప్రభుత్వాల నుంచి పర్మిషన్ వచ్చాక..బుక్ మై షోలో బుకింగ్స్ ఓపెన్ చేశారు.ఇక టికెట్ల ఆకలిమీదున్న ఫ్యాన్స్..ఒక్కసారిగా బుక్ మై షో ఓపెన్ అవ్వగానే..ఒక్కసారిగా టికెట్లు బుక్ చేసుకోవడానికి పోటీ పడ్డారు.దీంతో లక్షలాది మంది ఒకేసారి సైట్ ఓపెన్ చేయడంతో బుక్ మై షో యాప్ సైతం క్రాష్ అయ్యింది.ఇది కదా సలారోడి దెబ్బ..దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ కాస్త డిస్సపాయింట్ అయిన..సలార్ సినిమాకు పెరుగుతోన్న ఆదరణకు ఫిదా అయ్యారు.

ప్రస్తుతం బుక్మై షోలో అన్ని షోస్ పూర్తిగా ఫిల్ అయ్యాయి.అయితే, ఈ సినిమాకు ఉన్న డిమాండ్ కారణంగా..కావాలనే సర్వర్ డౌన్ చేశారా? లేదంటే నిజంగా క్రాష్ అయ్యిందా అని ఆలోచనలో పడ్డారు నెటిజన్స్. ఇది పబ్లిసిటీ స్టంట్ కాదని బుక్మై షో వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కూల్ అయ్యారని సమాచారం.