
ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా(Aha) గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరంలేదు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind), మై హోమ్ అధినేత రామేశ్వర్ రావు(Rameshwara Rao) కలిసి ఈ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ ప్రారంభించారు. నెట్ ఫ్లిక్స్, అమెజాన్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, జీ5 వంటి పాపులర్ ఓటీటీ సంస్థలలాగే ఆహా కూడా మంచి వ్యూయర్ షిప్ తో ముందుకు సాగుతోంది.
ముందు చిన్న సినిమాలతో మొదలైన ఆహా ప్రస్తానం.. తరువాత టాక్ షోస్, గేమ్ షోస్ తో మంచి ఫాల్లోయింగ్ ను సంపాదించుకుంది. అంతేకాదు.. కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లను తెరపైకి తీసుకొస్తూ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక నందమూరి నటసింహం బాలకృష్ణతో చేసిన అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షో ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియాలోనే బెస్ట్ షోగా నిలిచింది. అంతేకాదు.. అత్యంత రేటింగ్ సాధించిన షోగా రికార్డ్స్ క్రియేట్ చేసింది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఆహా ఓటీటీకి గూగుల్ పెద్ద షాకిచ్చింది అంటూ కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్లే స్టోర్ నుంచి ఆహా ఓటీటీ యాప్ ను డిలీట్ చేసిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. కారణం.. ఇటీవల గూగుల్ అన్ని యాప్స్ కి ఫీజ్ పెంచిందట. ఆహా టీమ్ ఈ మొత్తాన్ని పే చేసేందుకు నిరాకరించారట. దీంతో ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ ని డిలీట్ చేశారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ, చాలా మంది అలాంటిదేం లేదు అంటూ కామెంట్స్ చేస్తన్నారు. ప్లే స్టోర్ లో డిలేట్ అవలేదు. మాకు డౌన్లోడ్ అవుతోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వార్తలపై ఆహా టీమ్ ఎలా స్పందిస్తారో చూడాలి.