హీరోగానే కాక నిర్మాతగానూ వరుస చిత్రాలు నిర్మిస్తున్న కిరణ్ అబ్బవరం... ‘తిమ్మరాజుపల్లి టీవీ’ తర్వాత మరో సినిమాను నిర్మిస్తున్నాడు. పౌర్ణమి ఎంటర్‌టైన్మెంట్స్ శివశంకర నాయుడుతో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనుష్ గోరక్ దర్శకుడు. సోమవారం ఈ హారర్ మూవీకి ‘హతః’ అనే టైటిల్‌ను ఫైనల్ చేసినట్టు తెలియజేశారు.
ఓ నల్లపిల్లిని చూపిస్తూ 'ఈ పిల్లి బతికి ఉందా లేక..' అనే క్యాప్షన్‌తో విడుదల చేసిన మోషన్ పోస్టర్ ఆసక్తి రేపింది. కొత్త తరహా కథను స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయబోతున్నారనే ఇంప్రెషన్ ఈ పోస్టర్‌తో క్రియేట్ అవుతోంది. ‘బిగ్‌బాస్ 9’ ఫేమ్ తనూజ, రెహమాన్, కుష్లూ మద్దాల, నమ్రితా ఎంవీ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నట్టు తెలియజేశారు. త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్ రివీల్ చేస్తామన్నారు.
