ఈసారి ఫ్యామిలీస్‌‌‌‌‌‌‌‌ మెచ్చేలా.. జూన్ 19న హవీష్ మూవీ టైటిల్ గ్లింప్స్‌ రిలీజ్

ఈసారి ఫ్యామిలీస్‌‌‌‌‌‌‌‌ మెచ్చేలా.. జూన్ 19న హవీష్  మూవీ టైటిల్ గ్లింప్స్‌ రిలీజ్

నువ్విలా, జీనియస్, రామ్ లీలా, సెవెన్ వంటి చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హవీష్.  ప్రస్తుతం నక్కిన త్రినాథరావు తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న  మేకర్స్.. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌‌‌‌‌‌‌‌ను ఈ నెల 19న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. 

మంగళవారం ఈ చిత్రం నుంచి ఆన్ లొకేషన్ స్టిల్స్ విడుదల చేసిన మేకర్స్..  డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా దీన్ని రూపొందిస్తున్నట్టు తెలియజేశారు. విక్రాంత్ శ్రీనివాస్ స్టోరీ, డైలాగ్స్ అందిస్తున్న ఈ చిత్రాన్ని  నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే  వెల్లడించనున్నారు.