యుద్ధం ఆపడం జెలెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్కీకి ఇష్టంలేదు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. 

యుద్ధం ఆపడం జెలెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్కీకి ఇష్టంలేదు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. 
  • చర్చల కోసమే రష్యాపై ఆంక్షలు సడలించామని వెల్లడి

వాషింగ్టన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్  జెలెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్కీపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రష్యాతో నాలుగున్నరేండ్లుగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించడం జెలెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్కీకి ఎంతమాత్రం ఇష్టం లేదని ఆయన ఆరోపించారు. ఈమేరకు ఆదివారం ‘ట్రూత్ సోషల్’ లో ట్రంప్ ఒక పోస్ట్ చేశారు. 

‘‘రష్యా, ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల మధ్య శాంతిస్థాపన కోసం జరుపుతున్న చర్చల్లో మంచి పురోగతి కనిపిస్తోంది. అయితే, జెలెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్కీకి మాత్రం శాంతిపై ఎలాంటి ఆసక్తి లేదు. ఐరోపా దేశాల నుంచి భారీ మొత్తంలో ఆర్థిక సాయం వస్తుండడంతో యుద్ధం కొనసాగాలనే జెలెన్ స్కీ కోరుకుంటున్నాడు. నిజానికి ఆయన మొదటి నుంచీ యుద్ధం ముగియకూడదనే కోరుకుంటున్నారు” అని విమర్శించారు.

రష్యాపై ఆంక్షల సడలింపును సమర్థించుకున్న ట్రంప్

రష్యాపై విధించిన ఆంక్షలకు పలు సడలింపులు ఇవ్వడాన్ని ట్రంప్ సమర్థించుకున్నారు. ‘‘రష్యా విషయంలో నా నిర్ణయం చాలా స్పష్టంగా ఉంది. రష్యా, ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల మధ్య శాంతిని నెలకొల్పడానికి నేను చర్చలు జరుపుతున్నాను. ఇటువంటి సమయంలో రష్యాను చర్చల ప్రక్రియ నుంచి దూరం నెట్టివేసే ఏ తెలివితక్కువ పనిని నేను చేయను’’ అని పేర్కొన్నారు. దివంగత అమెరికా సెనెటర్ లిండ్సే గ్రాహం పేరుమీద తీసుకొచ్చిన చట్టం కింద రష్యాపై విధించాల్సిన కఠిన ఆంక్షలను నిలిపివేస్తూ శుక్రవారం రాత్రి డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. 

అమెరికాలో ఎన్నికల  నేపథ్యంలో ఇంధన ధరలను తగ్గించేందుకు రష్యా డీజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఉన్న ఆంక్షలను ట్రంప్ తాత్కాలికంగా సడలించారు. దీనివల్ల ప్రపంచ మార్కెట్లోకి రష్యన్ డీజిల్ భారీగా విడుదల కానుంది. అయితే, ఈ నిర్ణయాన్ని ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు దాని మిత్రదేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఫలితంగా ట్రంప్, జెలెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్కీల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి.