యాక్షన్ కామెడీ మూవీతో ముందుకొస్తున్న ప్రియాంక చోప్రా

యాక్షన్ కామెడీ మూవీతో ముందుకొస్తున్న ప్రియాంక చోప్రా

బేవాచ్, క్వాంటికో, సిటాడెల్ లాంటి హాలీవుడ్ ప్రాజెక్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మెప్పించిన ప్రియాంక చోప్రా.. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న  ప్రెస్టేజియస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా పాల్గొంది. ప్రియాంక గ్లోబల్ ఫాలోయింగ్.. ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెడుతుందనే అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. తను నటించిన  ‘హెడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అనే యాక్షన్ కామెడీ మూవీ రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రెడీ అయింది.  ప్రియాంకతో పాటు జాన్ సీనా, ఇద్రిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎల్బా లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నటించగా, జాక్ క్వాయిడ్, స్టీఫెన్ రూట్, కార్లా గుగినో, సార నైల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  కీలకపాత్రలు పోషించారు. ఇల్యా నైషుల్లర్ దర్శకత్వం వహించారు.

ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బిజీగా ఉంది ప్రియాంక. ఇక సినిమా కథ విషయానికొస్తే.. యాక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హీరో నుంచి అమెరికా ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎదిగిన వ్యక్తిగా జాన్ సీనా,  కమాండో స్థాయి నుంచి బ్రిటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మినిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిన వ్యక్తిగా ఇద్రిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నటించారు. విమానంలో కలిసి ప్రయాణిస్తున్న వీళ్లిద్దరిపై శత్రువులు దాడి చేస్తారు. దాన్నుంచి తప్పించుకుని ఓ ప్రాంతంలో ల్యాండ్ అవుతారు. అయినా శత్రువులు వదలరు.  సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంఐ6 ఏజెంట్ నోయెల్ బిస్సిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ప్రియాంక చోప్రా వాళ్లను ఎలా కాపాడింది అనేది మిగతా కథ. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇద్దరు హీరోల కామెడీ టైమింగ్, ప్రియాంక యాక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైలైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచాయి.  అమెజాన్ ప్రైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జులై 2 నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది.