హైదరాబాద్ లో జాబ్స్ : వైద్యశాఖలో పోస్టులు భర్తీ..పది పాసైతే చాలు..మేడ్చల్ -మల్కాజ్‌గిరి DMHO నోటిపికేషన్ రిలీజ్

హైదరాబాద్ లో జాబ్స్ : వైద్యశాఖలో పోస్టులు భర్తీ..పది పాసైతే చాలు..మేడ్చల్ -మల్కాజ్‌గిరి DMHO నోటిపికేషన్ రిలీజ్

తెలంగాణ ప్రభుత్వ వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోని మేడ్చల్ -మల్కాజ్‌గిరి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయం (డీఎంహెచ్ఓ) కాంట్రాక్ట్ ప్రాతిపదికన  వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆఫ్​లైన్ ద్వారా అక్టోబర్ 23 నుంచి 28 వరకు అప్లై చేయవచ్చు

మొత్తం ఖాళీలు: 121.విభాగాల వారీగా ఖాళీలు

 

  •  మెడికల్ ఆఫీసర్ 17 
  • స్టాఫ్​నర్స్ 50
  • సపోర్టింగ్ స్టాఫ్ 9
  • ఎంఎల్​హెచ్​పీ/ సీహెచ్ఓ/ ఎంఓ 13
  • డిస్ట్రిక్ట్ ఎపిడెమియాలజిస్ట్ 1
  •  ఏఎన్ఎం 8
  • ల్యాబ్ టెక్నీషియన్ 16
  • ఫార్మసిస్ట్ 4
  • పబ్లిక్ హెల్త్ మేనేజర్ 1
  •  పీపీఎం/ ఏసీఎస్ఎం కో–ఆర్డినేటర్ 1
  • టీడీ– మినీహబ్ మేనేజర్ 1

విద్యార్హతలు


మెడికల్ ఆఫీసర్ (బస్తీ దవాఖాన): ఎంబీబీఎస్ పూర్తి చేసి, తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి.

ఎంఎల్‌హెచ్‌పీ / సీహెచ్‌ఓ / ఎంఓ: ఎంబీబీఎస్ (తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్‌తో) లేదా నిర్దిష్ట ఇండియన్ మెడిసిన్ రిజిస్ట్రేషన్‌తో బీఏఎంఎస్ లేదా సంబంధిత నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్‌తో బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులై ఉండాలి.

స్టాఫ్ నర్స్: బీఎస్సీ నర్సింగ్, జీఎన్‌ఎం, ఎంఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్‌ఎంతోపాటు పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేసి, తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి.

ఏఎన్‌ఎం: నిర్దిష్ట మల్టీ-పర్పస్ హెల్త్ వర్కర్ (మహిళా) విద్యార్హతతోపాటు రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. లేదా తగిన క్లినికల్ శిక్షణ, అప్రెంటిస్‌షిప్, రిజిస్ట్రేషన్‌తో కూడిన ఇంటర్మీడియట్ ఒకేషనల్ ఎంపీహెచ్‌డబ్ల్యూ (మహిళా) అర్హత ఉండాలి.

ల్యాబ్ టెక్నీషియన్: ఇంటర్మీడియట్/ 10+2తోపాటు మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీలో నిర్దిష్ట డిప్లొమా/ సర్టిఫికెట్ లేదా సమాన అర్హత కలిగి, పారామెడికల్ రిజిస్ట్రేషన్ పొంది ఉండాలి.

ఫార్మాసిస్ట్: బి.ఫార్మసీ లేదా డిప్లొమా ఇన్ ఫార్మసీ పూర్తిచేసి, తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి.

డిస్ట్రిక్ట్ ఎపిడెమియాలజిస్ట్: ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్ లేదా ఎపిడెమియాలజీలో పీజీ అర్హత కలిగిన మెడికల్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. లేదా నిర్దిష్ట పబ్లిక్ హెల్త్ అనుభవం ఉన్న ఇతర నోటిఫైడ్ అర్హతలు ఉండాలి.

పబ్లిక్ హెల్త్ మేనేజర్: డెంటల్/ ఆయుష్/ నర్సింగ్/ లైఫ్ సైన్సెస్/ సోషల్ సైన్స్ విభాగంలో డిగ్రీతోపాటు సంబంధిత మాస్టర్స్ డిగ్రీ, రెండేళ్ల ఆరోగ్య కార్యక్రమ నిర్వహణ అనుభవం ఉండాలి.

పీపీఎం / ఏసీఎస్‌ఎం కో–ఆర్డినేటర్: కమ్యూనికేషన్, పబ్లిక్ -ప్రైవేట్ పార్టనర్‌షిప్ లేదా హెల్త్- ప్రాజెక్ట్ అనుభవంతోపాటు పీజీ అర్హత, ద్విచక్ర వాహనం నడిపే అనుభవం (డ్రైవింగ్ లైసెన్స్) ఉండాలి.

టీడీ-మినీ హబ్ మేనేజర్: హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ లేదా రెండేళ్ల హెల్త్ ప్రోగ్రామ్ అనుభవంతోపాటు నిర్దిష్ట పీజీ అర్హత కలిగి ఉండాలి.

సపోర్టింగ్ స్టాఫ్: టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి.

లోకల్ ఏరియా

  • బస్తీ దవాఖాన మెడికల్ ఆఫీసర్, ఎన్​హెచ్ఎం ఎంఎల్​హెచ్ పీ/ సీహెచ్ఓ/ ఎంఓ పోస్టులకు మల్టీ జోన్ – II అభ్యర్థులు అర్హులు.
  • స్టాఫ్​నర్స్, నర్సింగ్, ఫార్మాసీ, టెక్నికల్ పోస్టులకు జోన్–6 అభ్యర్థులు అర్హులు.
  • మిగతా పోస్టులకు మేడ్చల్​మల్కాజ్​గిరి జిల్లా అభ్యర్థులు మాత్రమే అర్హులు. 

వయసు: బస్తీ దవాఖాన మెడికల్ ఆఫీసర్ పోస్టులకు 18 నుంచి 46 ఏళ్ల మధ్యలో ఉండాలి. మిగతా పోస్టులకు 18 నుంచి 44 ఏళ్ల మధ్యలో ఉండాలి.  బీసీ, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఎక్స్ సర్వీస్​మెన్ అభ్యర్థులకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: అక్టోబర్ 23.

లాస్ట్ డేట్: అక్టోబర్ 28.

సెలెక్షన్ ప్రాసెస్

  • అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న పోస్టుకు నిర్దేశించిన విద్యార్హత (కోర్సు)లో సాధించిన మార్కులకు 90 మార్కుల వెయిటేజీ ఇస్తారు.
  • అభ్యర్థికి 18 సంవత్సరాలు నిండిన తర్వాత ప్రతి పూర్తి సంవత్సరానికి 0.5 మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కుల వరకు వయసు వెయిటేజీ కేటాయిస్తారు.  
  • మరిన్ని వివరాలకు వెబ్​సైట్ medchal-malkajgiri.telangana.gov.inను సందర్శించండి.