రాత్రి నిద్రతోనే ఆరోగ్యం సొంతం

రాత్రి నిద్రతోనే ఆరోగ్యం సొంతం

పార్టీలు, ఓవర్‌‌ నైట్ వర్క్‌ షిఫ్ట్​లే కాకుండా ఈ మధ్య వచ్చిన బింజ్​వాచ్‌(టీవీలు గంటల తరబడి చూడడం) ట్రెండ్‌వల్ల చాలామంది నిద్ర పోయే టైం (స్లీప్‌ సైకిల్‌) తగ్గిపోతుంది. ఇవే కాకుండా పని ఒత్తిడి కూడా సరైన నిద్ర లేకపోవడానికి కారణం అవుతోంది. రాత్రి నిద్రతోనే ఆరోగ్యం సొంతం అవుతుంది. సరైన టైంకి నిద్రపోవడంవల్ల చాలా రకాల లాభాలున్నాయి.

  • రాత్రి నిద్ర రోజులో శరీరానికి కావాల్సిన ఎనర్జీ ఇస్తుంది. ఉదయం ఫ్రెష్‌గా ఉంటారు. బద్ధకం ఉండదు. ఆరోగ్యంగా ఉంటారు. చురుకుగా పని చేసుకోగలుగుతారు.
  • ఊబకాయం బారిన పడకుండా శరీరాన్ని కాపాడుకోవచ్చు. 
  • నిద్ర సరిపోకపోతే చికాకు, కోపం పెరిగే అవకాశం ఉంటుంది. మానసిక ఒత్తిడికి గురిచేసే ప్రమాదం కూడా ఉంటుంది.
  • మంచి నిద్ర డయాబెటిస్‌, గుండె సమస్యలకు దూరంగా ఉంచుతుంది. ఇమ్యూనిటీ పెరగడానికి కూడా మంచి నిద్ర సాయ పడుతుంది.