ప్రదీప్ రావత్ అంత్యక్రియల్లో విషాద దృశ్యాలు.. దు:ఖం ఆగట్లేదు.. పాపం..!

ప్రదీప్ రావత్ అంత్యక్రియల్లో విషాద దృశ్యాలు.. దు:ఖం ఆగట్లేదు.. పాపం..!

ప్రదీప్ రావత్ చనిపోయారనే విషయాన్ని సినీ పరిశ్రమే కాదు 90’s కిడ్స్ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. తెలుగు చూస్తూ పెరిగిన 90’s కిడ్స్కి ఊహ తెలిశాక చూసిన సినిమాల్లో ప్రతి నాయకుడంటే ప్రదీప్ రావత్ గుర్తొస్తాడనడంలో అతిశయోక్తి లేదు. ‘సై’, ‘భద్ర’, ‘ఛత్రపతి’, ‘స్టాలిన్’, ‘దేశ ముదురు’, ‘రగడ’.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ప్రతి నాయకుడి నటించి మెప్పించిన సినిమాలకు టాలీవుడ్లో ఒక ప్రత్యేక స్థానముంది. ‘సై’ సినిమాలో భిక్షు యాదవ్ పాత్ర ఆయన నటనా ప్రావీణ్యానికి అద్దం పట్టింది. ఈ నటుడు చనిపోయాక ఆయన కుటుంబ నేపథ్యం ఏంటనే ఆసక్తితో కొందరు నెటిజన్లు ఇంటర్నెట్లో వెతుకులాట సాగిస్తున్నారు.

ప్రదీప్ రావత్కు రెండు సార్లు పెళ్లైంది. అయితే.. ఆయన మొదటి పెళ్లి ఎక్కువ కాలం నిలవలేదు. ఆయన వైవాహిక బంధానికి పెళ్లైన ఐదున్నర నెలలకే బీటలు వారాయి. భార్య నుంచి ఆయన విడాకులు తీసుకున్నారు. తన మొదటి భార్య తన కుటుంబం పరువు తీసిందని.. తన పైనా, తన కుటుంబం పైనా తప్పుడు ఆరోపణలు చేసిందని ప్రదీప్ రావత్ ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. ఈ అభిప్రాయ భేదాలకు ఆయన విడాకులతో ఫుల్ స్టాప్ పడింది.

కొన్నాళ్లకు ఆయనకు సినీ ఇండస్ట్రీలో కళ్యాణి రావత్ పరిచయమైంది. దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన ఆమెను 2006లో ప్రదీప్ రావత్ పెళ్లి చేసుకున్నారు. ప్రదీప్ రావత్, కళ్యాణి రావత్కు విక్రమాదిత్య రావత్ అనే కొడుకు ఉన్నాడు. సింగ్ రావత్ అనే మరో కొడుకు కూడా ఉన్నాడు. 2006లో స్టాలిన్ సినిమా షూటింగ్ టైంలో కళ్యాణికి, ప్రదీప్ రావత్కు పరిచయం ఏర్పడింది. అలా ఏర్పడిన పరిచయం ఇద్దరి మధ్య ప్రేమగా మారి వివాహ బంధం వైపునకు అడుగులేసింది. ప్రదీప్ రావత్ తన కుటుంబాన్ని ఇండస్ట్రీకి, మీడియాకు వీలైనంత దూరంగా ఉంచారు.

ఇండస్ట్రీ వ్యక్తి అయినప్పటికీ.. వ్యక్తిగత జీవితం గోప్యంగా ఉండాలని ఆయన భావించేవారు. ప్రదీప్ రావత్ అకాల మరణంతో ఆయన కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. ఆయన కొడుకు విక్రమ్ రావత్ గుండెల నుంచి ఉబికి వస్తున్న దు:ఖాన్ని దిగమింగుకుంటూ కనిపించాడు. అతనిని ఓదార్చడం అక్కడ ఉన్న వారి తరం కాలేదు. ప్రదీప్ రావత్ అంత్యక్రియలు ముంబైలో జరిగాయి.