బరువు తగ్గాలనుకుంటే వేడి నీళ్లతో స్నానం చేయండి

బరువు తగ్గాలనుకుంటే వేడి నీళ్లతో స్నానం చేయండి

 బరువు ఎక్కువగాఉంటే సమస్యకాదు. దాన్ని తగ్గించుకోకపోవడమే పెద్ద ప్రాబ్లం. వ్యాయామాలు, ఆహార ప్రణాళికలే కాకుండా వేడి నీళ్లతో స్నానం కూడా బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది. అంతే కాదు 30 నిమిషాల వాకింగ్ తో సమానమట ఈ వేడి నీళ్ల స్నానం. అదేంటి? ..స్నానానికి అధిక బరువుకి సంబంధం ఏంటి?.. అసలు ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా?… అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.

అధిక బరువుకి చెక్..

వ్యాయామం అనగానే మొదట అందరికీ గుర్తొచ్చేది జిమ్​. శరీరాన్ని ఫిట్ గా ఉంచడం జిమ్​ వల్లే సాధ్యమవుతుందని చాలామంది అనుకుంటారు. కానీ శరీరాన్ని హెల్తీగా, ఫిట్ గా ఉంచడానికి జిమ్, వాకింగ్ తో పాటు వేడి నీళ్ల స్నానం కూడా సహాయపడుతుందంటున్నారు లండన్​ యూనివర్సిటీ పరిశోధకుడు డాక్టర్ ఫాల్కి​నర్.

130 క్యాలరీలు కరిగించుకోవచ్చు..
మొత్తం 14 మంది పురుషులు ఈ పరిశోధనలో పాల్గొన్నారు. మొదట వారు గంట సేపు సైకిల్​ తొక్కడం, వాకింగ్ లాంటి వ్యాయామాలు చేశారు. తర్వాత గంట వేడి నీటి టబ్ లో ఉన్నారు. ఈ రెండు టెస్టులలో కరిగిన క్యాలరీలను లెక్కిస్తే సమానంగా తగ్గాయి. అంతేకాదు రోజూ వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల శరీరంలో 130 క్యాలరీలు తగ్గించుకోవచ్చు.
 
సాధారణంగా వేడి నీళ్లు శరీర బరువును తగ్గించే ప్రక్రియను వేగవంతం చేసి శరీరంలోని వేడిని తగ్గిస్తాయి. శరీర బరువుని తగ్గించే వ్యాయామాలలో కూడా ఇదే ప్రక్రియ జరుగుతుంది. అందువల్ల శరీర బరువు తగ్గుతుంది. అంతే కాదు వేడి నీటిలో ఉన్న వాళ్లలో 10 శాతం షుగర్ లెవల్స్ కూడా తగ్గాయి. మారుతున్న ఆహారపు అలవాట్లవల్ల స్థూలకాయ సమస్య అధికమవుతోంది. కానీ సమయం లేక చాలా మంది వ్యాయామాలకు తగిన సమయం కేటాయించలేకపోతున్నారు. అలాంటి వారికి ఈ వేడి నీళ్ల స్నానం బాగా ఉపయోగపడుతుంది.