హైదరాబాద్ లో కుండపోత వర్షం

హైదరాబాద్ లో కుండపోత వర్షం

నైరుతి రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్ లో కుండపోత వర్షం పడింది. బంజారహిల్స్, జూబ్లీహిల్స్, మణికొండ, మియాపూర్, యూసఫ్ గూడ, అమీర్ పేట్, పంజాగుట్ట, ఎస్ ఆర్ నగర్, దిల్ సుఖ్ నగర్, చైతన్యపురి, ఎబ్బీనగర్, నాగోల్, ఉప్పల్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. నాంపల్లి, అబిడ్స్, కోఠి, బషీర్ బాగ్, నారాయణ గూడ, ఖైరతాబాద్, అఫ్జల్ గంజ్, గోశామహల్, ఏంజే మార్కెట్ వర్షం పడింది. గంటపాటు ఉరుములు, మొరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో నగరంలోని రోడ్లన్ని చెరువులను తలపిస్తున్నాయి.

భారీ వర్షంతో హైదరాబాద్ లో డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లపై నీరు వరదలా ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని నగర వాసులకు జీహెచ్ఎంసీ అధికారులు ఆదేశించారు. లోతట్ట ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.