తిరుమలలో ఈదురు గాలులతో భారీ వర్షం

 తిరుమలలో ఈదురు గాలులతో భారీ వర్షం

తిరుమలలో  భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో దాదాపు గంటన్నరపాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వానతో తిరుమాడ వీధులు, రహదారులు పూర్తిగా జలమయం అయ్యాయి. భారీగా గాలులు వీయడంతో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. శ్రీవారి ప్రధాన ఆలయ పరిసరాల్లో పెద్ద ఎత్తున నీరు చేరింది. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంలో భక్తులు తడిసి ముద్దయ్యారు.