హైదరాబాద్ లో గత రెండు మూడు రోజులుగా వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. భారీ వర్షాలు కురుస్తుండటంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఈ క్రమంలో వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రావాల్సిన విమానాలను దారి మళ్లించారు. ఈ మేరకు శనివారం (జూన్ 13) ఎయిర్ పోర్టు అధికారులు ప్రకటన విడుదల చేశారు.
ప్రతికూల వాతావరణ పరిస్థితులు, తక్కువ విజిబిలిటీ కారణంగా శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి రావాల్సిన పలు విమానాలను ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు. ముఖ్యంగా ముంబై, పుణే, నాందేడ్, వారణాసి, బెంగళూర్, సింగపూర్, ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి రావాల్సిన విమానాలను ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు.
దారి మళ్లించిన విమానాలు:
- AI 2875 – ముంబై ➜ హైదరాబాద్
- S5 174 – పుణే ➜ హైదరాబాద్
- S5 197 – నాందేడ్ ➜ హైదరాబాద్
- 6E 6683 – వారణాసి ➜ హైదరాబాద్
- 6E 1028 – సింగపూర్ ➜ హైదరాబాద్
- 6E 638 – బెంగళూరు ➜ హైదరాబాద్
- 6E 5236 – ముంబై ➜ హైదరాబాద్
- 6E 717 – ఢిల్లీ ➜ హైదరాబాద్
- 6E 2083 – నియామే (NMI) ➜ హైదరాబాద్
