మూసాపేట్ బ్రిడ్జి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్

మూసాపేట్ బ్రిడ్జి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్

మూసాపేట్ బ్రిడ్జి వద్ద నుంచి కేపీహెచ్‭బీ వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. భరత్ నగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై భారీ కంటైనర్ లారీ ఆగిపోవడంతో.. వెనుక నుంచి వచ్చే వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దీంతో కిలోమీటర్ పైగా ఇరువైపులా రహదారి పై ట్రాఫిక్ స్థంభించిపోయింది. దీంతో వాహనదారులు  ఇబ్బందులు పడ్డారు. అక్కడికి చేరుకున్న బాలానగర్ ట్రాఫిక్ పోలీసులు.. భారీ కంటైనర్ లారీని తీయడానికి చర్యలు చేపట్టారు. 

క్రేన్ సహాయంతో వాహనాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. అప్పటికే వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో.. వాహనదారులు ఇబ్బందికి గురయ్యారు. కంటైనర్ లారీని పక్కకు జరిపి.. పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.