హైదరాబాద్–విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్.. ఎక్కడికక్కడే నిలిచిపోయిన వాహనాలు

హైదరాబాద్–విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్.. ఎక్కడికక్కడే నిలిచిపోయిన వాహనాలు

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. దసరా, బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ప్రజలు సొంతూర్లకు వెళ్తుండటంతో శనివారం (అక్టోబర్ 17) రాత్రి హైవేపై వాహనాలు రద్దీ నెలకొంది. 

రోడ్డు విస్తరణ, ఫ్లైఓవర్ నిర్మాణ పనుల నేపథ్యంలో చౌటుప్పల్ దగ్గర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. చౌటుప్పల్‎కు దాదాపు 3 కిలోమీటర్ల వరకు భారీగా ట్రాఫిక్ నెలకొంది. దీంతో చౌటుప్పల్ దాటేందుకు వాహనాలకు 45 నిమిషాల సమయం పడుతోంది. 

కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నెలకొనడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆనందంగా పండక్కి ఇంటికి వెళ్తున్న ప్రజలకు ట్రాఫిక్ నరకంగా మారింది. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు వాహనాల రద్దీని క్రమబద్దీకరిస్తున్నారు. గంట గంటకు వాహనాల రద్దీ పెరుగుతుండటంతో ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది.