
హృతిక్ రోషన్(Hrithik Roshan), దీపికా పదుకొణె(Deepika Padukone) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఫైటర్(Fighter). వార్(War), పఠాన్(Pathaan) సినిమాల ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్(Siddarth Anand) డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, రెండు పాటలకు గుడ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మూడో పాటను విడుదల చేశారు. విశాల్ శేఖర్ సంగీతం అందించాడు. ‘హీర్ ఆస్మాని’ అంటూ సాగే ఈ పాట ఓ సిచ్యువేషనల్ సాంగ్ అని అర్థమవుతోంది.
హృతిక్, దీపికతో ముఖ్యనటీనటులంతా ఇందులో కనిపిస్తున్నారు. ఎయిర్ ఫోర్స్ పైలెట్‌గా హృతిక్ రోషన్ నటిస్తున్న ఈ చిత్రాన్ని వయాకామ్ 18 స్టూడియోస్, మార్ ఫ్లిక్స్ పిక్చర్స్ సంస్థలపై మమతా ఆనంద్, రామన్ చిబ్, అంకు పాండే నిర్మిస్తున్నారు. అనిల్ కపూర్, అక్షయ్ ఒబెరాయ్, సంజీదా షేక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.