
సౌతాఫ్రికా వికెట్ కీపర్-బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ సంచలన నిర్ణయం తీసుకొని ప్రపంచ క్రికెట్ ను షాకింగ్ కు గురి చేశాడు. సోమవారం (జూన్ 2) సోషల్ మీడియా ద్వారా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన ఆశ్చర్యానికి గురి చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో తన పవర్ హిట్టింగ్ తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసే క్లాసన్ క్రికెట్ కు గుడ్ బై చెప్పడం సంచలనంగా మారింది. “నేను అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించడం నాకు విచారకరమైన రోజు” అని క్లాసెన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
"నాకు, నా కుటుంబానికి భవిష్యత్తుకు ఏది ఉత్తమమో నిర్ణయించుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి నా కుటుంబంతో ఎక్కువ సమయం గడపడమే. నా కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని నేను ఎదురుచూస్తున్నాను. నేను రిటైర్మెంట్ ప్రకటించడం ద్వారా నేను కోరుకున్నది చేయగలను". అని క్లాసన్ తన వీడ్కోలు తర్వాత తెలిపాడు. 33 ఏళ్ళ క్లాసన్ సౌతాఫ్రికా తరపున 60 వన్డేల్లో 2141 పరుగులు.. 58 టీ20ల్లో 1000 పరుగులు చేశాడు. ఓవరాల్ గా తన అంతర్జాతీయ కెరీర్ లో 4 సెంచరీలు.. 16 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
క్లాసన్ గత 2024లో టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్ట్ ఫార్మాట్ లో కేవలం నాలుగు టెస్టులు మాత్రమే ఆడాడు. 2019లో రాంచీ వేదికగా భారత్‌పై అరంగేట్రం తొలి టెస్ట్ ఆడిన క్లాసన్.. 2023లో వెస్టిండీస్‌పై తన చివరి టెస్ట్ ఆడాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ నాలుగు టెస్టుల్లో 13 యావరేజ్ తో 104 పరుగులు చేశాడు. సిడ్నీలో ఆస్ట్రేలియాపై చేసిన 35 పరుగులు క్లాసన్ టెస్టు కెరీర్ లో అత్యధికం.
JUST IN: Heinrich Klaasen has announced his decision to step away from international cricket pic.twitter.com/dijNMACB6f
— ESPNcricinfo (@ESPNcricinfo) June 2, 2025