తర్వాత బయటికి వచ్చేది శ్రీముఖే : హేమ

తర్వాత బయటికి వచ్చేది శ్రీముఖే : హేమ

బిగ్ బాస్-3 నుంచి ఎలిమినేట్ అయిన నటి హేమ మంగళవారం మీడియాతో మాట్లాడింది. మెంటల్ గా తాను స్ట్రాంగ్ గా ఉందామని బిగ్ బొస్  లోకి వెళ్ళానని…బట్ గేమ్ ఆడకుండానే బయటకు వచ్చేశాను అని చెప్పింది. వెళ్లినప్నట్నుంచే తన పై బాధ్యతలు ఎక్కువ పెట్టారన్న ఆమె..అందరూ అక్క అక్క అంటూనే… నాపై లేనిపోనివి చెప్పి… నేను బయటకు వచ్చేలా చేశారని చెప్పింది. వరుణ్ సందేశ్ కి తిండి పిచ్చి ఎక్కువ.. తింటూనే ఉంటాడని తెలిపింది. ఐటమ్స్ కంట్రోల్ లో ఉంచుదాం అని ట్రై చేశానని..తన వెనక ఉండి చాడీలు చెప్పి బయటకు పంపినవాళ్లే… నేను వచ్చే ముందు మిస్ యూ అక్క, మిస్ యూ అక్క అంటూ నటించారు అని చెప్పింది.

తన ఒరిజినల్ కారెక్టర్ పక్కన పెట్టివుంటే.. నేను ఇంకా హౌస్ లో ఉండేదాన్ని అని చెప్పిన హేమ..శ్రీ ముఖిది చాలా కన్నింగ్ కారెక్టర్ అని చెప్పింది. ఇక్కడివి అక్కడ… అక్కడివి ఇక్కడ పెట్టి గొడవలు పెడుతుందని అలా చేసిన శ్రీముఖే.. ఈ వీక్ నామినేషన్స్ లో ఉందని తెలిపింది. నెక్స్ట్ హౌస్ నుంచి బయటకు వచ్చేది… శ్రీముఖే అని చెప్పింది. అశు రెడ్డి విన్ అవ్వాలని కోరుకుంటున్నానని తెలిపింది హేమ.