నా సక్సెస్కి కారణం నాగార్జున బాబాయ్.. కళ్యాణ్ రామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

నా సక్సెస్కి కారణం నాగార్జున బాబాయ్.. కళ్యాణ్ రామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

నందమూరి కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan ram) హిట్టు కొట్టారు. అమిగోస్(Amigos) లాంటి ప్లాప్ తరువాత ఆయన నుండి వచ్చిన లేటెస్ట్ మూవీ డెవిల్(Devil) ఆడియన్స్ నుండి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మొదటి ఆట నుండే హిట్ టాక్ వచ్చింది. పీరియాడిక్ అండ్ ఇన్వెస్టిగేటీవ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఇక డెవిల్ సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు మూవీ టీమ్. ఇందులో భాగంగా తాజాగా ఓఇంటర్వ్యూలో పాల్గొన్నారు హీరో కళ్యాణ్ రామ్. ఈ ఇంటర్వ్యూలో తన సక్సెస్ కు కారణం హీరో నాగార్జున అని చెప్తూ వాళ్ళిద్దరి బాండింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు.   

ప్రతి హీరో విషయంలో అభిమానులకు నచ్చే కొన్ని ప్రత్యేకమైన అంశాలు ఉంటాయి. కొందరు డ్యాన్స్ ఇష్టపడతారు, కొందరు ఫైట్స్‌, కొంతమంది కామెడీ, ఎమోషన్.. ఇలా చాలారకాల ఇష్టాలు ఉంటాయి. అలాంటి అంశాలు మన సినిమాలో ఉండేలా జాగ్రత్త పడాలని,    డిఫరెంట్ స్టోరీలను ట్రై చేసినప్పటికీ.. ప్రేక్షకులు మన నుండి ఆశించే అంశాల గురించి మరిచిపోకూడదని నాగార్జున బాబాయ్ చెప్పారన్నారు కళ్యాణ్ రామ్. ఆయన చెప్పిన విషయాలను ఎప్పటికీ మర్చిపోనని, అందుకే ప్రేక్షకులు కోరుకునే విషయాలను తన సినిమాలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నానని చెప్పారు ఆయన అన్నారు. ప్రస్తుతం నాగార్జున గురించి కళ్యాణ్ రామ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఇక డెవిల్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ జంటగా మలయాళ కుట్టి సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటించారు. అభిషేక్‌ నామా నిర్మాతగా, దర్శకుడిగా వ్యవహరించిన ఈ సినిమాలో..  శ్రీకాంత్ అయ్యంగార్, మాళవిక నాయర్, సత్య, అజయ్ కీ ప్రధాన పాత్రల్లో కనిపించగా.. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు.