సినీ ఇండస్ట్రీని పైరసీ భూతం పట్టిపీడిస్తోంది. థియేటర్లలో మూవీ రిలీజైన కొన్ని గంటలకే పైరసీ రూపంలో చిత్రం బయటకు వచ్చేస్తుంది. ఇండస్ట్రీని తీవ్రంగా వేధిస్తున్న ఈ సమస్యపై కోలీవుడ్ హీరో కార్తి స్పందించారు. లేటెస్ట్ గా 'సర్దార్ 2' సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆయనఈ ఇష్యూపై ఓపెన్ గా మాట్లాడారు. అంతే కాదు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తో తనకు జరిగిన ఆసక్తికర సంభాషణను పంచుకున్నారు.
విజయ్ సార్ మీరే చూసుకోండి...
ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 10న 'సర్దార్ 2'గ్రాండ్ గా రిలీజ్ కానుంది. లేటెస్ట్ గా ఈ మూవీ ప్రెస్ మీట్ లో పైరసీపై ఒక యాంకర్ అడిగిన ప్రశ్నకు కార్తి స్పందించారు. ఈ సమస్య తీవ్రత గురించి ఇటీవల తమిళనాడు సీఎం విజయ్ సర్ తో మాట్లాడాను. 'అన్నా.. మిగతా వారికంటే సినిమా కష్టాలు, ఈ పైరసీ బాధలు మీకు బాగా తెలుసు. మీరే దీనిపై గట్టి చర్యలు తీసుకుని, టాలెంట్‌ను కాపాడాలి' అని కోరాను . ఇదే క్రమంలో తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇస్తూ, "నాకు రాజకీయంలోకి వచ్చే ఉద్దేశం లేదు, మంచి సినిమాలు తీసి ప్రేక్షకులను అలరించడమే నా ఏకైక లక్ష్యం" అని కుండబద్దలు కొట్టారు.
Q: Film is coming to piracy at the day of release, one of your actor became CM, what did you say❓#Karthi: Yes, #Vijay sir, our CM understands this issue well. Hope he'll take strong action. When i saw our CM i said 'Anna mathavangala vida ungalukku nallave theriyum, neengale… pic.twitter.com/ImvnoOjiuz
— AmuthaBharathi (@CinemaWithAB) September 2, 2026
అన్న సూర్యతో సరదా పోలిక
ఈవెంట్‌లో ఒక అభిమాని సూర్య కంటే మీరేం బాగా చేస్తారన్న ప్రశ్నకు స్పందిస్తూ.. నేను ఆయనను బాగా ఏడిపిస్తాను, ఆయన నన్ను బాగా కొడతారు అని నవ్వులు పూయించారు. నేను ఎత్తు పెరిగినా సూర్య అన్నతో పెట్టుకోలేను. 'సింగం' ఎప్పుడూ పెద్దదే, కానీ ఈ 'సిరుతై' (కార్తి) కాస్త ఎగిరి దూకగలదు అంతే అంటూ తమ పాపులర్ సినిమాల పేర్లను వాడుతూ ఇచ్చిన క్రేజీ రిప్లై ఇచ్చారు .
అభిమానులు 'ఖైదీ 2' ఎప్పుడు అని కేకలు వేయగా.. ముందు నన్ను 'సర్దార్ 2' రిలీజ్ చేసుకోనివ్వండి. ఆ తర్వాత లోకేష్ కనకరాజ్‌ను అడుగుదాం అని సరదాగా సమాధానమిచ్చారు. 'మెయ్యజగన్' (తెలుగులో 'సత్యం సుందరం') లాంటి క్లాసిక్ హిట్ తర్వాత వస్తున్న మార్పులపై మాట్లాడుతూ.. మేము తీసే ప్రతీ సినిమాను విభిన్నంగా ప్రయత్నిస్తున్నా. ఆడియన్స్ ఇచ్చే హిట్స్, ఫ్లాప్స్ రెండింటికీ సిద్ధంగా ఉంటానని చెప్పారు. మరి సెప్టెంబర్ 10న రిలీజ్ అవుతున్న 'సర్దార్ 2' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
Fan: What’s that one thing you do better than #Suriya sir, and what’s that one thing #Suriya sir does better than you? ❓#Karthi: Naan nalla avara pottu kudupen, avaru nalla adipaaru 😂. Naan avara vida konjam extra height valandhuten. Avarai adichidalaam-nu ninaippen, aana…
— Movies Singapore (@MoviesSingapore) September 2, 2026
