Kuberaa: కుబేరకు పాజిటివ్ టాక్.. మూడు సొసైటీల మధ్య క్లాష్.. నాగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Kuberaa: కుబేరకు పాజిటివ్ టాక్.. మూడు సొసైటీల మధ్య క్లాష్.. నాగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా నటించిన కుబేర మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది. ఇవాళ (జూన్ 20) థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీలో.. నాగార్జున నటనకు మంచి ప్రశంసలు వస్తున్నాయి. సీబీఐ ఆఫీసర్ క్యారెక్టర్‌లో నాగ్ తన నటనలో చాలా షేడ్స్ చూపించారని ఆడియన్స్ అంటున్నారు. ధనుష్, నాగార్జున పోటాపోటీగా నటించారని, క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ లో వీరి నటనకు మంచు మార్కులు వేయొచ్చని ప్రేక్షకులు X లో పోస్టులు పెడుతున్నారు. మరి ఈ సినిమా విశేషాలను హీరో నాగార్జున మాటల్లోనే చూసేద్దాం.

నాగార్జున చెప్పిన విశేషాలు:

‘కుబేర’లో మంచి యూనిక్ పాయింట్ ఉందని, ఇప్పుడున్న సొసైటీకి  ఆ పాయింట్ చాలా రిలెవెంట్‌‌‌‌గా ఉంటుందని నాగార్జున అన్నారు. శేఖర్ కమ్ముల గారితో వర్క్ చేయాలని ఎప్పటినుంచో ఉండేది. ఆయన సినిమాలు నాకు బాగా ఇష్టం. ఆయన కథల్లో సోషల్ రిలెవెంట్ పాయింట్ ఉంటుంది. మిగతావన్నీ కూడా కమర్షియల్‌‌‌‌గానే ఉంటాయి. ఈ  కథ, క్యారెక్టర్స్, స్క్రీన్ ప్లే అన్నీ డిఫరెంట్‌‌‌‌గా ఉంటాయి.

ఈ సినిమాలో మంచోళ్ళు ఉన్నారు. చెడ్డోళ్ళు ఉన్నారు. అల్ట్రారిచ్, మిడిల్ క్లాస్, బిలో పావర్టీ లైన్.. ఇలా మూడు సొసైటీల మధ్య క్లాష్ ఉంటుంది. నాది మిడిల్ క్లాస్ క్యారెక్టర్. సిబిఐ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా కనిపిస్తా. నా క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో చాలా షేడ్స్  ఉంటాయి. మంచి చేయాలా, చెడు చేయాలా అనే సంఘర్షణ మధ్య నా పాత్ర  ఉంటుంది. కథకు తగ్గట్టుగా నా బాడీ లాంగ్వేజ్, మాట తీరు, రియాక్షన్.. అవన్నీ కూడా  కొత్తగా ఉంటాయి. శేఖర్ కమ్ముల స్టైల్‌‌‌‌లో ఉంటాయి.

ధనుష్ ఫెంటాస్టిక్ యాక్టర్. తన పాత్రలో ఒదిగిపోయి చేశాడు. బిచ్చగాడి పాత్రలో అద్భుతంగా నటించాడు. రష్మిక  క్యారెక్టర్ చాలా ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనింగ్‌‌‌‌గా ఉంటుంది. ఈ కథలో తనది రిఫ్రెషింగ్ క్యారెక్టర్. ఇందులో ఏ క్యారెక్టర్ కూడా హీరో హీరోయిన్ అనడానికి లేదు. అన్ని పాత్రలు సహజంగానే ఉంటాయి. ఇలాంటి సినిమాలు చేయడానికి గట్స్ కావాలి. 

సినిమాని దాదాపుగా రియల్ లొకేషన్స్‌‌‌‌లోనే షూట్ చేశాం. తిరుపతి, ముంబై, గోవా, బ్యాంకాక్ సహా అన్ని రియల్ లొకేషన్స్‌‌‌‌లో వర్క్ చేశాం. అలాగే ఇందులో చాలా అద్భుతమైన ఇన్సిడెంట్స్ ఉంటాయి. అవన్నీ కూడా రియల్ లైఫ్‌‌‌‌కి దగ్గరగా ఉంటాయి.  

ఈ సినిమాకి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. పాటలు చాలా సిచ్యువేషనల్‌‌‌‌గా వస్తాయి. దేవిశ్రీ ప్రసాద్ వండర్‌‌‌‌‌‌‌‌ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇక  నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహనరావు చాలా ప్యాషన్‌‌‌‌తో ఈ సినిమా తీశారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ ప్రాజెక్టుని నిర్మించారు.  

నా వందో సినిమా ప్లానింగ్ జరుగుతోంది. దానికి ‘కింగ్ 100’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ప్రస్తుతం రజినీకాంత్‌‌‌‌తో కలిసి ‘కూలీ’లో డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నా. ఫస్ట్ టైమ్ ఇలాంటి పాత్ర పోషించా. ‘శివ’ సినిమాను త్వరలోనే 4కే క్వాలిటీతో రీ రిలీజ్ చేయబోతున్నాం.  బెటర్ ఎఫెక్ట్స్ కోసం వర్క్ జరుగుతోంది. ఒక రీల్ చూసాను. చాలా బాగా వస్తోంది.