నాని గ్యాంగ్ లీడర్ ఫస్ట్ లుక్ టీజర్

నాని గ్యాంగ్ లీడర్ ఫస్ట్ లుక్ టీజర్

మెగాస్టార్ సినిమాల్లో గ్యాంగ్ లీడర్ ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఇదే టైటిల్ తో మరో సినిమా రాబోతుంది. విక్రమ్ కే కుమార్ డైరెక్షన్ లో నాని హీరోగా నటిస్తున్న సినిమాకు గ్యాంగ్ లీడర్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇవాళ నాని పుట్టినరోజు సందర్భంగా కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన లుక్ ను, టీజర్ ను ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశాడు. గ్యాంగ్ లీడర్ టైటిల్ ను తన కొత్త సినిమాకి పెట్టాడు నాని. గ్యాంగ్ లీడర్ టైటిల్ లుక్ పోస్టర్ తోపాటు టీజర్ ను కూడా నాని ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. ఒక చిన్నపాప సర్..కూతురు వయస్సుంటుంది. ఎనిమిదేళ్లుంటాయి..అనే డైలాగ్స్ తో ప్రారంభమయ్యే టీజర్ ఆసక్తికరంగా ఉంది. గ్యాంగ్ లీడర్ లుక్, టీజర్ నాని అభిమానులకు ఖుషి చేస్తోంది.