
వేసే ప్రతి అడుగూ డిఫరెంట్‌గానే పడేలా చూసుకోవడం నాని ప్రత్యేకత. ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్‌కృష్ణ డైరెక్షన్‌లో ‘వి’ చిత్రంలో నటిస్తున్న నాని.. ఆ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో రూపొందే సినిమాకి ‘టక్ జగదీష్’ అంటూ ఒక డిఫరెంట్ టైటిల్‌ను ఖరారు చేశారు. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. రీతూవర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లు. వచ్చే యేడు ప్రారంభంలో షూటింగ్ మొదలు కానుంది.
తమన్ సంగీతం, ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందిస్తారు. ‘నిన్ను కోరి’ తర్వాత శివ మరోసారి నానితో చేయబోతున్న ఈ సినిమా టైటిల్ లుక్‌ను మంగళవారం విడుదల చేశారు. పంట పొలాలు, విండ్ మిల్స్ బ్యాక్‌డ్రాప్‌తో నాని టక్ సరి చేసుకుంటూ కనిపిస్తున్నాడు. నాని కూల్‌గా ఉండే కథల్ని ఎంచుకుంటాడు. శివ కూడా ఆ తరహా సినిమాలు తీయడంలో ఎక్స్‌పర్ట్. మరి వీళ్లిద్దరూ కలిసి ఎలాంటి సినిమాతో వస్తారో చూడాలి.