నిఖిల్ భయ్యా నువ్వు గ్రేట్.. సలార్ సినిమాకి 100 టికెట్స్ ఫ్రీ

నిఖిల్ భయ్యా నువ్వు గ్రేట్.. సలార్ సినిమాకి 100 టికెట్స్ ఫ్రీ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ సలార్(Salaar). కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 22న థియేటర్స్ రానుంది. పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా కోసం ఆడియన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. దీంతో అడ్వాన్స్ బుకింగ్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎగబడుతున్నారు.

అయితే..  తెలుగులో సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. దీంతో ఫస్ట్ డే టికెట్స్ దొరుకుతాయా అని చాలా టెన్షన్ పడుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అలాంటి ఫ్యాన్స్ కు అదిరిపోయే ఆఫర్ ప్రకటించారు యంగ్ హీరో హీరో నిఖిల్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కోసం హైదరాబాద్ శ్రీరాములు థియేటర్లో డిసెంబర్ 21న అర్ధరాత్రి ఒంటి గంటకు సలార్ షో పడుతుందని, ఈ షోకి 100 మంది ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫ్రీగా టికెట్స్ ఇస్తానని, వారితో కలిసి సినిమా చూస్తానని ప్రకటించారు. సరిగ్గా పదేళ్ల క్రితం అదే థియేటర్లో మిర్చి సినిమా రాత్రి ఒంటిగంట షో చూశాను, సలార్ సినిమాతో హిస్టరీ మళ్ళీ రిపీట్ అవుతుంది.. అంటూ ట్వీట్ చేశారు నిఖిల్. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే సలార్ ఫ్రీ టికెట్స్ ఎలా పొందాలి అనేదానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు నిఖిల్. మరి సలార్ సినిమా కోసం ఫ్రీ టికెట్స్ పొందే ఆ వంద మంది ఎవరో చూడాలి.