భీష్మ : చీరకట్టులో బాపు బొమ్మలా రష్మిక

భీష్మ : చీరకట్టులో బాపు బొమ్మలా రష్మిక

వెంకీ కుడుముల డైరెక్షన్ లో నితిన్ హీరోగా నటిస్తున్న సినిమా భీష్మ. నితిన్ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. దీపావళి కానుకగా ఆదివారం ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది యూనిట్. చీరకట్టులో రష్మికను అందంగా చూపించారు. ఆమె వెంటపడుతున్న నితిన్ స్టిల్ బాగుంది. మరో పోస్టర్ లో నితిన్ ఫైట్ చేస్తున్నాడు.

టైటిల్ తోనే ఆకట్టుకున్న ఈ మూవీ..ఇవాళ వచ్చిన పోస్టర్ ఫ్యాన్స్ ని విఫరీతంగా ఆకట్టుకుంటుంది. సితార ఎంటర్‌ టైన్మెంట్స్‌ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రిలో జరుగుతుంది. లవ్, ఫ్యామిలీ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీని ప్రేమికులరోజు కానుకగా ఫిబ్రవరి-14న రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.