తమ్ముడు షూటింగ్ లో ప్రమాదం.. హీరో నితిన్కు గాయాలు?

తమ్ముడు షూటింగ్ లో ప్రమాదం.. హీరో నితిన్కు గాయాలు?

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్‌(Nithin)కు గాయాలు అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన వేణు శ్రీరామ్(Venu Sriram) డైరెక్షన్‌లో తమ్ముడు(Thammudu) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే మొదలైన ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు మారేడుమిల్లి ప్రాంతంలో జరుగుతోంది. ఇందులో భాగంగా ఓ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తుండగా నితిన్ కు ప్రమాదం జరిగిందని సమాచారం.

వెంటనే ఆసుపత్రికి తరలించగా.. మూడు వారాలపాటు రెస్ట్‌ తీసుకోవాలని సూచించారట వైద్యులు. ఇక ఈ న్యూస్ తెలుసుకున్న నితిన్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. కానీ, ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు.. ఆందోళల చెందాల్సిన పనిలేదని, కేవలం మూడు వారాలపాటు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని తెలుస్తోంది.