నాకు పెళ్లైంది..నా డబ్బు నాకు ఇవ్వాల్సిందే..నితిన్ కామెంట్స్ వైరల్

నాకు పెళ్లైంది..నా డబ్బు నాకు ఇవ్వాల్సిందే..నితిన్ కామెంట్స్ వైరల్

నితిన్ (Nithiin) హీరోగా వక్కంతం వంశీ (Vakkantham Vamsi) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఎక్స్‌‌ట్రా’ ఆర్డినరీ మ్యాన్’ (Extra Ordinary Man) ట్యాగ్‌‌లైన్‌‌తో  శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్య మూవీస్, రుచిర ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. శ్రీలీల(Sreeleela) హీరోయిన్‌‌గా నటిస్తోంది. ఈ మూవీ డిసెంబర్ 8న వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతుంది. 

ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. లేటెస్ట్గా నితిన్, శ్రీలీల ఒక ప్రమోషన్ ఈవెంట్లో భాగంగా ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. 

ఈ ఈవెంట్లో ఓ జర్నలిస్ట్ మాట్లాడుతూ..ఈ సినిమాను నిర్మిస్తున్న నిర్మాత సుధాకర రెడ్డి మీ తండ్రి అనే విషయం అందరికీ తెలిసిందే. ఫ్యాన్స్ అందరిలో తరుచుగా మెదిలే ప్రశ్న ఏంటంటే..మీ నాన్న బ్యానర్ లో సినిమాలు చేస్తే..మీకు రెమ్యునరేషన్ ఇస్తారా? అని అడగగా..నితిన్ ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చారు. ‘ఇంతకు ముందు అయితే తనకు పెళ్లి కాలేదని.. ఇప్పుడు మాత్రం తనకు పెళ్లైందని..తన డబ్బులు తనకు రావాల్సిందే అని’..సరదాగా మాట్లాడి అందర్నీ నవ్వించారు నితిన్. మరి స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న నితిన్‌కు తండ్రి సుధాకర్ రెడ్డి ఎంత రెమ్యునరేషన్ ఇస్తారనేది మాత్రం చెప్పలేదు. 

గతంలో నితిన్ హీరోగా తమ సొంత బ్యానర్ అయిన శ్రేష్ఠ్ మూవీస్(Sreshth Movies) లో ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే, చిన్నదానా నీ కోసం, చల్ మోహన్ రంగ, మాస్ట్రో,మాచర్ల నియోజకవర్గం మూవీస్ను తెరకెక్కించారు.