
సంక్రాంతి అంటేనే గోదావరి జిల్లాలు గుర్తొస్తాయి. అందులోనూ భీమవరం స్పెషల్. ప్రభాస్ సొంతూరు కూడా ఇదే. దీంతో సంక్రాంతి సందర్భంగా తను నటిస్తున్న కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను భీమవరంలో లాంచ్ చేశారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘రాజా సాబ్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ప్రభాస్ వింటేజ్ గెటప్‌లో ఇంప్రెస్ చేస్తున్నాడు.
లుంగీ పైకి కట్టి, బ్లాక్ షర్ట్‌లో ప్రభాస్ కనిపిస్తున్న ఈ పోస్టర్‌ను కలర్‌ఫుల్‌గా డిజైన్ చేసిన మేకర్స్.. ‘డార్లింగ్ అవతార్‌లో డైనోసర్’ అంటూ క్యాప్షన్ ఇవ్వడం సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. సరదాగా, రొమాంటిక్‌గా సాగే క్యారెక్టర్‌లో ప్రభాస్ లుక్ ఫ్రెష్ ఫీల్ కలిగిస్తోంది. ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ ‘ఫ్యాన్స్‌ను ఏ విధంగా అలరించాలనుకుంటున్నారో అలా కనిపించేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నారు.
ఈ సినిమాకు సంబంధించి ప్రతి నెల ఒక అప్‌డేట్‌ను ఇస్తాం. ఇయర్ ఎండింగ్‌లోపు సినిమా రిలీజ్ చేస్తాం’ అని అన్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూఛిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.