అందుకే నా సినిమాలకు కలెక్షన్స్ తగ్గాయి.. సల్మాన్ ఖాన్ షాకింగ్ కామెంట్స్

అందుకే నా సినిమాలకు కలెక్షన్స్ తగ్గాయి.. సల్మాన్ ఖాన్ షాకింగ్ కామెంట్స్

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్(Salman Khan) షాకింగ్ కామెంట్స్ చేశారు. తన సినిమాల కలెక్షన్స్ ఈ మధ్య చాలా వరకు తగ్గాయని దానికి కారణం కూడా చెప్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన తమిళ దర్శకుడు విష్ణువర్ధన్(Vishnuvardhan) దర్శకత్వంలో ది బుల్(The Bull) అనే సినిమా చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ మేకర్ కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇప్పటినుండి భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. 

ఇదిలా ఉంటే.. సల్మాన్ ఖాన్ నుండి వచ్చిన గత రెండు, మూడు సినిమాలు భాక్సాఫీస్ దగ్గర అంత ప్రభావం చూపించలేకపోయాయి. దీంతో బాలీవుడ్ స్టార్స్ లిస్టులో కాస్త వెనుకబడ్డారు సల్మాన్. కేవలం రిజల్ట్ విషయంలోనే కాదు కలెక్షన్స్ విషయంలో కూడా వెనుకబడిపోయారు సల్మాన్. అదే సమయంలో షారుఖ్ నటించిన గత రెండు సినిమాలు భారీ విజయాన్ని సాధించాయి. రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర రూ.1000 కోట్ల వసూళ్ళని రాబట్టి షారుఖ్ ను టాప్ లో నిలబెట్టాయి. 

ఇక భారీ అంచనాల మధ్య వచ్చిన సల్మాన్ ప్రీవియస్ మూవీ టైగర్ 3 సినిమాకు కేసుల సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. ఈ సినిమా కలెక్షన్ విషయం పక్కన పెడితే.. సరైన ఓపెనింగ్స్ కూడా దక్కించుకోలేకపోయింది. అయితే ఇదే విషయంపై తాజాగా స్పందించారు సల్మాన్. తన సినిమాలకు కలెక్షన్స్ రాకపోవడంపై మాట్లాడిన ఆయన.. నా సినిమాలకు టికెట్‌ ధరలు చాలా తక్కువగా ఉంటున్నాయి. ఎక్కువ రేట్స్ తో విడుదల చేస్తే నా సినిమాలకు కూడా కలెక్షన్స్‌ భారీగానే వస్తాయి. నా నెక్స్ట్ సినిమాలకు అలాగే  చేయాలనుకుంటున్నాను.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు సల్మాన్‌. ప్రస్తుతం సల్మాన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.