Anil Sunkara: ఈరోజు సంతోషంగా నిద్రపోవచ్చు..వాట్సప్ స్క్రీన్ షాట్ బయటపెట్టిన అనిల్ సుంకర

Anil Sunkara: ఈరోజు సంతోషంగా నిద్రపోవచ్చు..వాట్సప్ స్క్రీన్ షాట్ బయటపెట్టిన అనిల్ సుంకర

సందీప్ కిషన్ (Sandeep Kishan) హీరోగా విఐ ఆనంద్(VI Anand) దర్శకత్వంలో వస్తున్న మూవీ ఊరు పేరు భైరవకోన. ఈ మూవీ ఫిబ్రవరి 16 న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయింది. దీంతో మూవీ టీమ్ ప్రమోషన్స్లో వేగం పెంచేశారు.

లేటెస్ట్గా ఈ సినిమాకు సంబంధించిన వాట్సప్ చాట్ స్క్రీన్ షాట్ను పంచుకున్నాడు ప్రొడ్యూసర్ అనిల్ సుంకర (Anil Sunkara). 'డల్లాస్‌లో రోజు ముగుస్తున్నందున మా హీరో నాకు ఈ ఈ మెసేజ్, వీడియోను పంపాడు. మా డైరెక్షన్ మరియు cg టీమ్‌కి ధన్యవాదాలు, ఈరోజు సంతోషంగా నిద్రపోవచ్చు..'అని పోస్ట్ చేశారు. అంతేకాకుండా వీడియో క్లిప్ కింద హీరో సందీప్ కిషన్ ‘ఏదో గట్టిగానే జరిగేటట్టు ఉంది సర్’ అంటూ మెసేజ్ కూడా పెట్టాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

ఇప్పటికే బైరవకోన నుంచి రిలీజైన నిజమేనే చెప్తున్నా..జానే జానా సాంగ్ ఆడియన్స్ ను ఫిదా చేసింది. ఈ ఒక్క సాంగ్ తో ఆడియన్స్ థియేటర్ కి వెళ్లి చూడాలని..ఫిక్స్ అయ్యారు. అంతేకాదు విఐ ఆనంద్ ట్రైలర్ లో చూపించిన మేకింగ్ కి కూడా ఆడియన్స్ కు బాగా నచ్చేసింది. ఫాంటసీ ప్రపంచానికి తీసుకు వెళ్లే బైరవ కోన విజువల్‌ ట్రీట్‌ చూడడానికి రెడీగా ఉండండి.

అనిల్ సుంకర..ఇటీవల కాలంలో ఈ ప్రొడ్యూసర్ పేరు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ వచ్చింది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మంచు మనోజ్ బిందాస్ మూవీతో ప్రొడ్యూసర్ గా కెరీర్ స్టార్ట్ చేశారు. పలు సక్సెస్ ఫుల్ మూవీస్ తో హిట్స్ చూశారు అనిల్ సుంకర. 

కానీ  రీసెంట్ గా అఖిల్ తో ఏజెంట్, మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ సినిమాలు చేసి భారీ డిజాస్టర్స్ సొంతం చేసుకున్నారు. అఖిల్ ఏజెంట్ బడ్జెట్ దాదాపు 70 కోట్లు. కానీ వచ్చింది మాత్రం 12 నుండి 13 కోట్లు. పెట్టిన బడ్జెట్ లో 10 శాతం కూడా రికవరీ చేయలేకపోయింది దీంతో కోలుకోలేని డిజాస్టర్ ను చవిచూశారు అనిల్ సుంకర. ఇక భోళా శంకర్ తోనే నష్టాల బాటలోనే ఉన్నారు. ఇపుడు అనిల్ సుంకర బ్యానర్ నుంచి రాబోతున్న ఫాంటసీ అడ్వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూవీ ఊరు పేరు భైరవకోన పైనే చాలా ఆశలు పెట్టుకున్నారు.