పాపం రవితేజ.. ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్!

పాపం రవితేజ.. ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్!

ఈసారి సంక్రాంతికి టాలీవుడ్ లో భారీ పోటీ జరిగింది. ఎవరికి వారు తమ తమ సినిమాలను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భీష్మింన్చుకు కూర్చున్నాయి. అన్నట్టుగానే వచ్చాయి కూడా.. ఒక రవితేజ(Raviteja) సినిమా తప్ప. ఆయన హీరోగా వస్తున్న పాన్ ఇండియా మూవీ ఈగల్(Eagle) ను సంక్రాంతి కానుకగా తీసుకురావాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. కానీ, మూడు రోజుల వ్యవధిలో ఐదు సినిమాలంటే ఎవరికో ఒకరికి నష్టం జరగుతుంది. ఆ కారణంగా రవితేజ తన సినిమాను ఫిబ్రవరికి వాయిదా వేసుకున్నాడు.

దీంతో రవితేజ సినిమాకు న్యాయం జరిగేలా సోలో రిలీజ్ కు ప్లాన్ చేస్తామని నిర్మాతల మండలి నిర్ణయించింది. అలా ఫిబ్రవరి 9వ డేట్ ను ఈగల్ కోసం సెట్ చేశారు. కానీ, ఆ ప్లాన్ కూడా వర్కౌట్ అయ్యేలా కనిపించడంలేదు. సోలో రిలీజ్ అని చెప్పి అదే రోజున సందీప్ కిషన్ హీరోగా వస్తున్న ఊరు పేరు భైరవకోన కూడా రిలీజ్ కానుంది. మేకర్స్ డేట్ కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దీంతో ఈసారి కూడా రవితేజ సింగల్ గా రావడం కష్టంగానే కనిపిస్తోంది.

నిజానికి ఊరు పేరు భైరవకోన కూడా సంక్రాంతికి రావాల్సింది. వాళ్ళు కూడా మిగతా సినిమాలతో కాంపిటీషన్ ఇష్టంలేక ఫిబ్రవరికి వాయిదా వేసుకున్నారు. దీంతో ఈసారి ఎవరికోసం వెనక్కి తగ్గే అవకాశం లేదని స్పష్టం చేశారు ఊరు పేరు భైరవకోన మేకర్స్. ఇదే విషయం గురించి సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ఇలాంటి పరిస్థితుల్లో మా సినిమా రిలీజ్‌ డేట్‌ మార్చుకునే అవకాశం లేదు. ఈగల్‌ టీమ్ నుండి మాకు ఎలాంటి కాల్స్ రాలేదు. మాతో టచ్‌లోకి రాలేదు. ఎన్ని జరిగినా  ఫిబ్రవరి 9వ తేదీన రావాలని ఫిక్స్‌ అయ్యాం.. అంటూ చెప్పుకొచ్చాడు సందీప్ కిషన్.