రావు బహదూర్.... మునుపెన్నడూ చూడని తెలుగు సినిమా...

రావు బహదూర్.... మునుపెన్నడూ చూడని తెలుగు సినిమా...

వైవిధ్యభరిత చిత్రాలతో వెర్సటైల్ యాక్టర్‌‌‌‌గా రాణిస్తున్న సత్యదేవ్‌‌.. ‘రావు బహదూర్‌‌‌‌’ అనే  సైకలాజికల్ థ్రిల్లర్‌‌‌‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.  వెంకటేష్ మహా దర్శకుడు. చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మించారు. శుక్రవారం సినిమా రిలీజ్‌‌ అవుతున్న సందర్భంగా హీరో సత్యదేవ్‌‌ చిత్ర విశేషాలను గురించి వివరించారు. 

  • ‘‘మ్యాజికల్ రియలిజం, డార్క్ కామెడీ సబ్‌‌జానర్స్‌‌గా వస్తున్న కంప్లీట్ సైకలాజికల్ డ్రామా ఇది. 1960–99 మధ్య జరిగే కథ. ఇందులో హీరో దేశసంచారి. అలా తిరుగుతూ తన ప్యాలెస్‌‌కు చేరుకున్నాక జరిగే పరిణామాలు ఆసక్తికరంగా ఉంటాయి. మేకప్‌‌ వేయడానికి 5 గంటలు, తీయడానికి గంటన్నర పట్టేది. ఇలాంటి పాత్రలు పోషించడానికి చాలా సహనం కావాలి. ఈ చిత్రంతో నాకు కూడా చాలా సహనం ఉందని అర్థమైంది.  
  • ఇలాంటి హెవీ మేకప్‌‌ క్యారెక్టర్స్‌‌ కమల్ హాసన్, సూర్య, విక్రమ్ ప్రయత్నించారు. అవి చూసినప్పుడు ఎప్పటికైనా ఇలాంటివి ట్రై చేయాలని అనుకునేవాడిని. ఒకరకంగా అది నా డ్రీమ్. ఈ చిత్రంతో ఆ అవకాశం వచ్చింది. అయితే ఈ సినిమాకు మేకప్ కంటే మైండ్ మేకప్ చాలా ముఖ్యం. ప్రతిరోజూ 16 గంటలు పని చేయాలని ముందే ఫిక్స్ అయ్యా.  
  • ఇందులోని రామప్ప క్యారెక్టర్‌‌కు ఎలాంటి రిఫరెన్స్ లేదు. వెరీ మ్యాడ్ క్యారెక్టర్ అది. సినిమా చేస్తున్నప్పుడు రామప్ప క్యారెక్టర్ నన్ను ఆవహించాడేమో అన్నట్టుగా అనిపించింది. అంతలా ఆ పాత్రలో లీనమైపోయా. వెంకటేష్ మహా ప్రతి లేయర్‌‌ను చాలా అద్భుతంగా రాయడంతో పాటు అంతే అద్భుతంగా తీశారు. సినిమా రిపీట్‌‌గా చూసేలా ఉంటుంది. 
  • నా కెరీర్‌‌లో 'జ్యోతిలక్ష్మి'కి ముందు, ఆ తర్వాత అనుకుంటాను. ఇప్పుడు 'రావు బహదూర్'కి ముందు, తర్వాతగా చూస్తారని నమ్ముతున్నా. ఇక ఫారెస్ట్‌‌ బ్యాక్‌‌డ్రాప్‌‌లో ‘సమవర్తి’ అనే సినిమా చేస్తున్నా.  ఇప్పటివరకు నేను టచ్ చేయని జానర్ ఇది.  'ఫుల్ బాటిల్'లో మాస్ క్యారెక్టర్ చేస్తున్నా. అలాగే ఓ కామెడీ సినిమా కూడా చేస్తున్నా’’. 

మహేష్ బాబు గారు, నమ్రత గారు కలిసి సినిమా చూశాక... దాదాపు 40 నిమిషాలు మాట్లాడారు. ఆయన టీజర్‌‌కు వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు. సుకుమార్‌‌‌‌ గారితో సహా ఇప్పటివరకూ సినిమా చూసిన వాళ్లంతా ‘మునుపెన్నడూ చూడని తెలుగు సినిమా’ అని చెప్పారు.  ఎందుకు అలా చెప్పారో సినిమా చూశాక అర్థమవుతుంది.