
టాలెంటెడ్ హీరో సిద్దార్థ్(Siddarth) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ చిత్తా(Chitta). ఇప్పటికే తమిళంలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్టుగా నిలిచింది. దీంతో చాలా కాలంగా హిట్టు కోసం ఎదురుచూస్తున్న సిద్దార్థ్ కు చిత్తా తో డీసెంట్ హిట్ పడింది. దీంతో ఈ సినిమాను చిన్న(Chinna) పేరుతో తెలుగులో కూడా రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు సిద్దార్థ్. తెలుగు రిలీజ్ కోసం ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టాడు.
ఇందులో భాగంగానే ప్రెస్ మీట్ నిర్వహించార చిన్న మూవీ మేకర్స్. ఈ సందర్బంగా ఈమధ్య వివాదాస్పద జర్నలిస్ట్ సురేష్ కొండేటి (Suresh Kondeti)కి మాస్ వార్ణింగ్ ఇచ్చాడు సిద్దార్థ్. ఈ జర్నలిస్ట్ గురించి సిద్దార్థ్ మాట్లాడుతూ.. సురేష్ కొండేటి కూడా వచ్చారు. ఆయనికి ఒక వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్న. ఇది నేను ఇచ్చేది కాదు.. సోషల్ మీడియా మొత్తం ఇవ్వమంది. ప్రెస్ మీట్ లో పద్దతిగా కూర్చొని, పద్దతిగా మైక్ పట్టుకొని, పద్ధతి ప్రశ్నలు అడగమనండి. ఆయన అడిగే ప్రతీ చెత్త ప్రశ్నకు మీరు జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు అని సోషల్ మీడియాలో చెప్పారు.. అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చాడు సిద్దార్థ్.
సిద్దార్థ్ చెప్పిన మాటలకూ అక్కడున్నవాళ్ళందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. దాంతో వెంటనే అది కవర్ చేయడానికి.. సురేష్ కొండేటి నా ఫ్రెండ్. తనని ఏదైనా అడిగే హక్కు నాకు ఉంది.. అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక చిన్న సినిమా తెలుగులో అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.