భారతీయుడు 2 మూవీ నచ్చడానికి నేనూ ఓ కారణమవుతా.. హీరో సిద్ధార్థ్‌

భారతీయుడు 2 మూవీ నచ్చడానికి నేనూ ఓ కారణమవుతా.. హీరో  సిద్ధార్థ్‌

పాన్ ఇండియా లెవెల్లో ఉన్న..సినిమా ఫ్యాన్స్ అంతా..ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీ భారతీయుడు 2 (Indian 2). తమిళ ఎస్ శంకర్‌ డైరెక్షన్ లో..లోకనాయకుడు కమల్‌హాసన్‌ నటిస్తున్న మూవీ కావడంతో భారీ అంచానాలు నెలకొన్నాయి.

లేటెస్ట్ గా భారతీయుడు సినిమా గురుంచి హీరో సిద్ధార్ధ్ ముఖ్యమైన విషయాలు పంచుకున్నారు.  కమల్ హాసన్ భారతీయుడు 2 లో కీలకమైన రోల్ లో కనిపిస్తున్నారు సిద్ధార్ధ్. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని..ఇప్పటికే మూవీ డబ్బింగ్‌ వర్క్స్ స్టార్ట్ అయినట్టు తెలిపారు.

భారతీయుడు మూవీలో తను ప్లే చేసిన క్యారెక్టర్ గురుంచి మాట్లాడుతూ..కమల్‌హాసన్‌, శంకర్‌ భారతీయుడు సినిమా అనే బ్రాండ్‌ ఇమేజ్‌ ఒక్కటి చాలు ఇండియా వైడ్ గా ఉన్న సినీ ఫ్యాన్స్ థియేటర్స్ కు వస్తారని చెప్పగలను. అలాగే ఈ మూవీ అందరికీ నచ్చడానికి తానూ కూడా ఓ కారణమవుతానని సిద్ధార్థ్‌ వెల్లడించారు. ఈ మూవీలో సిద్ధార్ధ్ పాత్రతో ప్రధాన భాగంలో మలుపు ఉండనున్నట్లు సమాచారం. 

సిద్ధార్ధ్ సినిమాల విషయానికి వస్తే..

చిన్నా మూవీ సక్సెస్ తో..తన లాంటి యాక్టర్  తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కోరుకుంటారని సిద్ధార్థ్​ ఆనందం వ్యక్తం చేశారు. ఈ మూవీ రిలీజ్ కు ముందు నెలకొన్న పరిస్థితులు..ఎంతో భావోద్వేగానికి గురి చేశాయని తెలిపారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఈవెంట్ లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన సిద్ధార్థ్ మాట్లాడుతూ..చిన్నా మూవీ ప్రేక్షకుల చప్పట్ల కోసం కాదని, సమాజంలో ఏదో ఒక చోట మార్పు వస్తుందని..అందుకే స్వయంగా నిర్మించినట్లు పేర్కోన్నారు. 

ఈ మూవీ తన కెరీర్లో స్పెషల్ ఫిల్మ్ గా ఉంటుందని చెపుతూ..చిన్నా మూవీ గురుంచి ఇంకా చాన్నాళ్లు ప్రేక్షకులు మాట్లాడుకుంటారని తెలిపారు. అలాగే తన నుంచి రాబోయే సినిమాలను ప్రస్తావిస్తూ..వరుసగా నాలుగు సినిమాలు డిఫరెంట్ జోనర్ లో రాబోతున్నాయని..ఇందులో ఒక మంచి ఫ్యామిలీ సినిమా కూడా ఉంటుందని వివరించారు.     

ALSO READ : IND vs PAK: ఇండియా- పాక్ హైవోల్టేజ్ మ్యాచ్.. 10 సెకన్లకు 50 లక్షలు వసూలు!