
బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season7)లో ఒక రైతు బిడ్డగా అడుగుపెట్టి.. తన ఆటతో ఆడియన్స్ మనసులు గెలుచుకున్నారు పల్లవి ప్రశాంత్(Pallavi prashanth). ముందు మనోడిని హౌస్ మేట్స్ తక్కువ అంచనా వేశారు కానీ.. ఆటలో వాళ్లకు సైతం దిమ్మతిరిగేలా ఆడి గెలిచాడు ప్రశాంత్. అంతేకాదు.. సీజన్ 7కు ఫస్ట్ కెప్టెన్ గా నిలిచాడు. దీంతో పల్లవి ప్రశాంత్ కు బయట ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అదే రేంజ్ లో వోటింగ్ కూడా వస్తోంది.
Also Read : పాపం కృతీ.. ఆ ఒక్క సినిమాపైనే ఆశలన్నీ
ఇక ఇదే విషయంపై బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ సోహైల్ ఇంట్రెసింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం సోహైల్(Sohail) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ బూట్‌కట్ బాలరాజు(Bootcut balaraju). త్వరలో రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ సీజన్ 7 గురించి, పల్లవి ప్రశాంత్ గురించి స్పందించారు సోహైల్.
బిగ్‌బాస్ షోలో పల్లవి ప్రశాంత్ బెస్ట్ అని చెప్తాను. అతను ఎవరితోను దురుసుగా ప్రవర్తించలేదు. పెద్దగా చదువుకోకపోయినా.. ఇతరుల పట్ల అగౌరవంగా ప్రవర్తించలేదు. ఆ ప్రవర్తన నాకునచ్చింది కాబట్టి.. ఒకసారి నా సోషల్ మీడియాలో ఫార్మర్ అని పోస్ట్ చేశాను. దానికి నన్ను తిడుతూ మెసేజ్‌లు వచ్చాయి. దాంట్లో నేను చేసిన తప్పేంటో అర్థంకాలేదు. కొందరు దొంగ, ఫాల్తు, ఫ్రాడ్ అంటూ గలీజు కామెంట్స్ చేశారు. అందుకే బిగ్‌బాస్ గురించి ఎక్కడా మాట్లడకూడదని అనుకున్నాను.. అంటూ చెప్పుకొచ్చారు సోహైల్.