హీరో శ్రీరామ్ ‘ది మేజ్’ సైకలాజికల్ థ్రిల్లర్.. దర్శకుడిగా డా. రవికిరణ్ పరిచయం

హీరో శ్రీరామ్ ‘ది మేజ్’ సైకలాజికల్ థ్రిల్లర్.. దర్శకుడిగా డా. రవికిరణ్ పరిచయం

హీరో శ్రీరామ్ (శ్రీకాంత్) నటిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్  ‘ది మేజ్’తో  డా. రవికిరణ్ గడలాయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.  ఎం.డి. పాథాలజిస్ట్‌‌‌‌గా పనిచేస్తున్న ఆయన గతంలో మొబైల్‌‌‌‌తో  ‘ది రాంగ్ స్వైప్’ అనే  షార్ట్‌‌‌‌ఫిల్మ్ తెరకెక్కించాడు. శనివారం ఆయన పుట్టినరోజు.

ఈ సందర్భంగా రవికిరణ్ మాట్లాడుతూ ‘నేను ఎక్కడా అసిస్టెంట్ డైరెక్టర్‌‌‌‌గా పనిచేయలేదు.  కానీ చిన్నప్పటినుంచే ఒక సినిమా తీయాలనే కల ఉండేది.  ఫిలిం మేకింగ్‌‌‌‌లో దర్శకులు అకిరా కురోసావా, సెల్వరాఘవన్, సందీప్ రెడ్డి వంగా నాకు ఇన్‌‌‌‌స్పిరేషన్.  ఇప్పుడు ‘ది మేజ్’ చిత్రంతో దర్శకుడిగా తొలి ప్రయత్నం చేస్తున్నా. ప్రస్తుతం సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది.  ప్రియాంక, హ్రితిక శ్రీనివాస్, కమల్ కామరాజు  కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వాస్తవం–భ్రమ మధ్యనున్న సరిహద్దులను చెరిపేసేలా ఉత్కంఠభరితమైన సైకలాజికల్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌గా ఈ సినిమా రూపొందుతోంది’ అని చెప్పాడు.  ఈ చిత్రాన్ని  డాక్టర్ ఉదయ్ కె. రెడ్డి పాల్వాయి, డాక్టర్ కేఎస్ఆర్ (కరెడ్డి శ్రీధర్ రెడ్డి), డాక్టర్ భరత్ రెడ్డి గోపు, డాక్టర్ అనిరుధ్ రెడ్డి సోమ నిర్మిస్తున్నారు.