కంగువ డబ్బింగ్ షురూ చేసిన సూర్య.. చాలా స్పెషల్ అంట!

కంగువ డబ్బింగ్ షురూ చేసిన సూర్య.. చాలా స్పెషల్ అంట!

సూర్య హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘కంగువ’. దిశా పటానీ హీరోయిన్‌‌‌‌. ‘శౌర్యం’ ఫేమ్‌‌‌‌ శివ దర్శకత్వం వహిస్తున్నాడు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. బాబీ డియోల్‌‌‌‌ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇటీవల షూటింగ్‌‌‌‌ పూర్తి కాగా, పోస్ట్‌‌‌‌ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. బుధవారం హీరో సూర్య డబ్బింగ్ వర్క్‌‌‌‌ స్టార్ట్‌‌‌‌ చేశాడు.

ఈ సందర్భంగా హీరో సూర్యతో డైరెక్టర్ శివ, ఇతర టెక్నీషియన్స్ తీసుకున్న ఫొటోను మేకర్స్ విడుదల చేశారు. పాన్ వరల్డ్‌‌‌‌ మూవీగా పది భాషల్లో త్రీడీలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సూర్య నటన, వరల్డ్‌‌‌‌ క్లాస్‌‌‌‌ మేకింగ్ హైలైట్‌‌‌‌ కానున్నాయని, ఇండియన్‌‌‌‌ సిల్వర్ స్క్రీన్‌‌‌‌పై ఓ స్పెషల్‌‌‌‌ సినిమాగా ఇది నిలవనుందని నిర్మాతలు తెలిపారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామన్నారు.