కమర్షియల్ కంటెంట్​తో..

కమర్షియల్ కంటెంట్​తో..

సుధీర్ బాబు, మాళవిక శర్మ జంటగా ‘సెహరి’ ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’.  సునీల్, అక్షర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌‌‌‌‌‌కు ట్రెమండెస్ రెస్పాన్స్ వచ్చింది. ఐదు భాషల్లో రిలీజ్ అయిన టీజర్‌‌‌‌ నేషనల్‌‌ వైడ్‌‌గా ట్రెండింగ్‌‌లో ఉంది. ఈ సందర్భంగా సోమవారం టీజర్ సక్సెస్ మీట్‌‌ను నిర్వహించారు మేకర్స్. సుధీర్ మాట్లాడుతూ ‘టీజర్‌‌‌‌కి మంచి రీచ్, రివ్యూలు వచ్చాయి. మంచి ఎమోషన్స్, చాలా హైస్‌‌తో కమర్షియల్ కంటెంట్ ఉన్న చిత్రమిది.

సాగర్ నన్ను కొత్తగా ప్రెజెంట్ చేశాడు.  చాలా బలమైన పాత్రని పోషించాను. నా కెరీర్‌‌‌‌లో ఇది గేమ్ చేంజర్ అవుతుందనే నమ్మకం ఉంది’ అని చెప్పాడు. టీజర్‌‌‌‌ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెప్పిన సాగర్.. చేతన్ భరద్వాజ్ అందించిన మ్యూజిక్ సినిమాను నెక్స్ట్ లెవల్‌‌కు తీసుకెళ్తుందన్నాడు.  సుమంత్ మాట్లాడుతూ ‘నిర్మాతగా ఇది నా ఫస్ట్ మూవీ.  టీజర్‌‌‌‌కు ఆడియెన్స్ నుంచి వస్తున్న  రెస్పాన్స్ చూస్తుంటే మంచి సినిమా చేశాననే నమ్మకాన్ని ఇచ్చింది’ అని చెప్పారు.