దిల్ రాజు ప్రొడక్షన్స్ లో సుహస్ కొత్త చిత్రం షురూ 

దిల్ రాజు ప్రొడక్షన్స్ లో సుహస్ కొత్త చిత్రం షురూ 

నటుడిగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్న సుహాస్.. లీడ్ రోల్‌‌‌‌లో వరుస సినిమాలు చేస్తున్నాడు. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న చిత్రంలో సుహాస్ హీరోగా నటిస్తున్నాడు. సంకీర్తన విపిన్ హీరోయిన్. మంగళవారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు.

ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు ప్రశాంత్ నీల్ క్లాప్ కొట్టారు. అనిల్ రావిపూడి కెమెరా స్విచాన్ చేయగా, ‘బలగం’ వేణు గౌరవ దర్శకత్వం వహించాడు. దిల్ రాజు, శిరీష్ స్ర్కిప్ట్‌‌‌‌ను అందించారు. రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, గోపరాజు మరణ, మురళీ శర్మ, రఘుబాబు, పృథ్వీ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నాడు.