హైట్ ఉన్న హీరోలు  కామెడీ చేయకూడదంటే ఎలా..?: వరుణ్ తేజ్

హైట్ ఉన్న హీరోలు  కామెడీ చేయకూడదంటే ఎలా..?: వరుణ్ తేజ్

‘కొరియన్ కనకరాజు’  కడుపుబ్బా నవ్వించే నాన్‌‌‌‌‌‌‌‌స్టాప్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్ అని హీరో  వరుణ్ తేజ్ అన్నాడు. తను హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ చెప్పిన విశేషాలు.


‘‘నేను ఏ కథ విన్నా,  థియేటర్‌‌‌‌‌‌‌‌లో కూర్చొని సినిమా చూస్తున్న ప్రేక్షకుడిలాగే వింటాను. ముఖ్యంగా ఇందులో ఉన్న ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్ నాకు చాలా నచ్చింది.  ప్రేక్షకులు రెండున్నర గంటల పాటు నవ్వుకునే సినిమా చేయాలనే ఉద్దేశంతో ఇది చేశాను.   హైట్ ఎక్కువ ఉండే హీరోలు కామెడీ చేయకూడదనే ఒక అభిప్రాయం ఉంది.  అది సరైనది కాదు. పాత్రను సరిగ్గా రాస్తే కామెడీ కుదురుతుంది. 'కొరియన్ కనకరాజు'లో కామెడీతో పాటు యాక్షన్ కూడా చాలా బాగా కుదిరింది. ఇందులో  రెండు  విభిన్నమైన బాడీ లాంగ్వేజ్‌‌‌‌‌‌‌‌లు, రెండు భిన్నమైన మనస్తత్వాలు చూపించే అవకాశం రావడం సంతోషంగా అనిపించింది.  నటుడిగా ఇది చాలా తృప్తిని ఇచ్చింది.  నాకు కొత్త విషయాలు నేర్చుకోవడం చాలా ఇష్టం.

 కొత్త పాత్రలు చేయడం, కొత్త వ్యక్తిలా జీవించడం  ఎక్సయిటింగ్‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది.  ఈ చిత్రం కోసం రాయలసీమ యాసతోపాటు కొరియన్ లాంగ్వేజ్‌‌‌‌‌‌‌‌ కూడా నేర్చుకున్నా. నా క్యారెక్టర్ డిజైన్ విషయంలోనూ చాలా ప్లాన్ చేశాం. హెయిర్‌‌‌‌‌‌‌‌స్టైల్ పూర్తిగా కొరియన్ లుక్‌‌‌‌‌‌‌‌లో ఉండేలా కేర్ తీసుకున్నాం.  అందుకే మొదటిసారి జుట్టుకు కలర్ కూడా వేశాను.  మనకు ఆ స్టైల్ వింతగా  అనిపించొచ్చు. కానీ కొరియాలో షూటింగ్‌‌‌‌‌‌‌‌కు వెళ్లినప్పుడు అదే హెయిర్‌‌‌‌‌‌‌‌స్టైల్‌‌‌‌‌‌‌‌తో చాలామందిని చూశా. నేను, సత్య  చేసే కామెడీకి ప్రేక్షకులు ఎంజాయ్  చేస్తారు.  రితిక నాయక్  నిజమైన కొరియన్‌‌‌‌‌‌‌‌లా భావించి యాక్ట్ చేసింది.  ఈ సినిమా కోసం  ప్రతి విషయాన్ని డబుల్ చెక్ చేసుకున్నాం. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. తమన్ మ్యూజిక్  థియేటర్‌‌‌‌‌‌‌‌లో గొప్ప సౌండ్  ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియన్స్ ఇస్తుంది. టీజర్, ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  సినిమా కూడా అందరికీ తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది’’.