తమిళ గడ్డపై మెగా కామెంట్స్.. కొండన్న సూపర్ అంటున్న నెటిజన్స్

తమిళ గడ్డపై మెగా కామెంట్స్.. కొండన్న సూపర్ అంటున్న నెటిజన్స్

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన లేటెస్ట్ మూవీ భోళా శంకర్(Bhola shankar) సినిమా భారీ డిజాస్టర్ అయినా విషయం తెలిసిందే. ఈ సినిమాకు వచ్చిన రిజల్ట్ తో చిరంజీవి సైతం తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయన పేరును ప్రస్తావిస్తూ చాలా మంది దారుణమైన ట్రోల్స్ చేశారు. ఈ ట్రోలింగ్స్ మెగా అభిమానులను కాస్త ఇబ్బంది పెట్టాయి. అందులో కొంతమంది రియాక్ట్ అయ్యారు కూడా. అయితే తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay devarakonda) కూడా భోళా శంకర్ సినిమా పరాజయంపై, మెగాస్టార్ చిరంజీవి స్టార్డమ్ ఫై కామెంట్స్ చేశారు. 

విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఖుషి(Khushi). క్లాస్ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ(Shiva nirvaana) తెరకెక్కించిన ఈ సినిమాలో సౌత్ స్టార్ సమంత(Samantha) హీరోయిన్ గా నటించింది. సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చెన్నై వెళ్లారు హీరో విజయ్ దేవరకొండ. ఇందులో భాగంగా ప్రెస్ మీట్ పాల్గొన్న ఆయన సినిమా గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చారు. అలాగే చిరంజీవి గురించి కూడా చెప్పుకొచ్చారు. విజయ్ మాట్లాడుతూ.. చిరంజీవి అంటే నాకు చాలా ఇష్టం, గౌరవం. ఆయన ఒక ఎవరెస్టు. తెలుగు ఇండస్ట్రీలో చాల మార్పులు తీసుకొచ్చారు. ఆయన సాధించిన విజయాలు నాలాంటో లక్షల మందికి స్ఫూర్తి. అలాంటి గొప్ప వ్యక్తులను విజయాలు, పరాజయాలతో జేడ్జ్ చేయలేము. కానీ కొంతమంది చేస్తున్న కామెంట్స్ చూస్తుంటే బాధేస్తుంది. కనీసం గౌరవం కూడా లేకుండా మాట్లాడం కరక్ట్ కాదు అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం విజయ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ విజయ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కొండన్నా నువ్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.