ఘనంగా విశాల్-అనిశా ఎంగేజ్ మెంట్

ఘనంగా విశాల్-అనిశా ఎంగేజ్ మెంట్

హీరో విశాల్ ఎంగేజ్ మెంట్ ఘనంగా జరిగింది. హైదరాబాద్‌ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కూతురు అల్ల అనీశా రెడ్డితో విశాల్ పెళ్లి ఫిక్స్ కాగా..శనివారం  హైదరాబాద్‌ లో ఓ హోటల్‌ లో ఎంగేజ్‌ మెంట్‌ జరిగింది. కుటుంబసభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు కూడా ఉంగరాలు మార్చుకున్న తర్వాత ఆప్యాయంగా హగ్ చేసుకున్నారు. తాను చేసుకోబోయే అమ్మాయిని అభిమానులకు పరిచయం చేసిన విశాల్ .. త్వరలోనే వివాహ తేదీని కూడా ప్రకటిస్తాడని అభిమానులు భావిస్తున్నారు.

పెళ్లి చూపులు, అర్జున్‌ రెడ్డి సినిమాలతో అనీశా రెడ్డి తెలుగు ప్రేక్షకుల పరిచయమైంది. విశాల్ ప్రస్తుతం టెంపర్ రీమేక్ ‘అయోగ్య’ లో నటిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 19న రిలీజ్ కానుంది.