అమెరికాలో విశాల్తో ఉన్న అమ్మాయి ఎవరు : కెమెరా చూసి ఎందుకు ముసుగు

అమెరికాలో విశాల్తో ఉన్న అమ్మాయి ఎవరు : కెమెరా చూసి ఎందుకు ముసుగు

సోషల్ మీడియా..ఎలాంటి వార్తలు అయినా ప్రతి ఒక్కరికీ చేరేలా చేస్తోంది. ఇందులో కొన్ని వార్తలు నెమ్మదిగా చేరేలా ఉంటాయి. మరికొన్ని ఊహించిన దానికంటే మరింత వేగంతో నెటిజన్స్ దృష్టికి వెళతాయి. ఇలాంటి క్రమంలోనే సినీ స్టార్స్ కొన్ని కావాలనే వైరల్ వీడియోస్ చేస్తుంటారు. మరికొన్ని వారికి తెలియకుండానే లీక్ అవుతూ బయటకు వస్తుంటాయి. ఇక ఆ తర్వాత తీరిగ్గా దాని గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు. 

లేటెస్ట్గా హీరో విశాల్ కూడా అలాంటి ప్రమోషన్స్ ఫాలో అవుతున్నాడనే సందేహం వచ్చేలా..ఓ వీడియో వైరల్ అవుతోంది.ఈ వీడియోలో  విశాల్ ఓ అమ్మాయితో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లడం..ఇక ఆ అమ్మాయితో సరదాగా మాట్లాడుతూ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక అదే సమయంలో ఎవరో మీడియా వాళ్ళు కెమెరాలతో షూట్ చేస్తున్నారనే..విశాల్ సడెన్ గా అలెర్ట్ అవుతూ..ఆ అమ్మాయి మీద షర్ట్ కప్పుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడం వీడియోలో కనిపిస్తోంది. ఇందులో విశాల్..న్యూ గర్ల్ ఫ్రెండ్ అని అనగా ..తిరిగి చూస్తూ వెళ్ళిపోయాడు.

ప్రస్తుతం ఈ వీడియోని ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. క్రిస్మస్ సెలబ్రేషన్స్ కోసం విశాల్ ఇలా ప్రొమోషన్ చేసాడనే కామెంట్స్ వస్తుండగా..కొంతమంది నెటిజన్లు మాత్రం విశాల్ తన కొత్త సినిమా ప్రమోషన్ కోసం చేసిన ట్రిక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

ప్రస్తుతం విశాల్ సింగం సిరీస్ డైరెక్టర్ హరి డైరెక్షన్ లో ఓ కంప్లీట్ మాస్ యాక్షన్ రత్నం అనే మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుపుకుంటోంది. భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ్ భాషలలో తెరకెక్కుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమా రిలీజ్ టైంకి..ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోకి.. ప్రమోషన్ స్ట్రాటజీలు ప్లే చేయాల్సిన అవసరం అసలు ఉండదు అంటూ మరికొంత మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ ఈ వీడియోపై విశాల్ స్పందిస్తే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.