విజయకాంత్ మరణవార్త తట్టుకోలేక..వెక్కి వెక్కి ఏడ్చిన విశాల్

విజయకాంత్ మరణవార్త తట్టుకోలేక..వెక్కి వెక్కి ఏడ్చిన విశాల్

నటుడు, డీఎండీకే అధినేత కెప్టెన్‌ విజయకాంత్ (Vijayakanth) కన్నుమూయడంతో..కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విజయకాంత్ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. తాజాగా హీరో విశాల్ కెప్టెన్ విజయకాంత్ మరణవార్త విని తట్టుకోలేకపోతున్నానంటూ కన్నీళ్లు పెట్టుకున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ వీడియోలో విశాల్ వెక్కి వెక్కి ఏడుస్తూ..నా జీవితంలో నేను కలిసిన అత్యంత ఉన్నతమైన వ్యక్తుల్లో ఒకరైన విజయ్ కాంత్ మరణవార్త విని నా కాళ్ళు,చేతులు వణికిపోతున్నాయి. రియల్ కెప్టెన్ ను కోల్పోవడం బాధకరం. నేను నడిగర్ సంగం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు..ఆయన నుంచి నేను సామజిక సేవ నేర్చుకున్నాను. మీలాంటి మంచివారిని ఆ దేవుడు ఎందుకింత త్వరగా దూరం చేస్తాడో తెలియదు.

మీరు పార్టీ పెట్టి ప్రజలకు చేసిన సేవను ఎప్పటికీ మరచిపోలేము. నాకు మీరెప్పుడు స్ఫూర్తినిచ్చిన యోధుడిగా నా గుండెల్లో ఉంటారు. మిమ్మల్ని కడసారి చూసుకోలేక పోతున్నందుకు చింతిస్తున్నాను. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను..అంటూ ఏడుస్తూ పంపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రస్తుత విశాల్ న్యూయార్క్‌లో ఉండటంతో రాలేకపోతున్నందుకు..విజయ్ కాంత్తో ఉన్న అనుబంధాన్నిఈ వీడియోతో పంచుకున్నారు. కాగా..విజయ్ కాంత్ అంత్యక్రియలు రేపు సాయంత్రం 4.30గంటలకు కోయంబేడులోని డిఎండికే కేంద్ర కార్యాలయంలో జరగనున్నాయి.