Vishwak Sen Gaami: నా కెరీర్లోనే గామి చివరిది.. విశ్వక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Vishwak Sen Gaami: నా కెరీర్లోనే గామి చివరిది.. విశ్వక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak sen) ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ గామి(Gaami). దర్శకుడు విశ్వధర్(Vishwadhar) తెరకెక్కించిన ఈ సినిమా మార్చ్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. వినూత్న కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ట్రైలర్ రిలీజ్ తరువాత ఆ అంచనాలు మరింత పెరిగాయి. కారణం ఈ సినిమాలో కనిపిస్తున్న విజువల్స్ హాలీవుడ్ స్థాయిలో ఉండటమే. ఇక మేకర్స్ కూడా ముందు నుండి ఒకటే చెప్తున్నారు. ప్రేక్షకులకు ఈ సినిమా ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది అని. ట్రైలర్ తరువాత ఆడియన్స్ కు అదే ఫీలింగ్ ఉన్నారు. దీంతో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. 

తాజాగా గామి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు విశ్వక్ సేన్. ఈ ఇంటర్వ్యూలో ఆయన గామి సినిమా గురించి, తన తదుపరి సినిమాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. గామి సినిమా నాకే కాదు ఆడియన్స్ కి కూడా చాలా ప్రత్యేకం. దాదాపు ఆరు సంవత్సరాలుగా ఈ సినిమా కోసం కష్టపడుతున్నాం. కథ, కథనం, విజువల్స్, గ్రాఫిక్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఆడియన్స్ కి ఒక సరికొత్త అనుభూతిని ఇస్తాయి. ఇలాంటి సినిమా రావడం చాలా అరుదు. ఇదొక ప్రయోగాత్మక చిత్రం. 

ఇక నా కెరీర్ లో నేను చేస్తున్న చివరి ప్రయోగాత్మక చిత్రం కూడా ఇదే. ఇకనుండి నేను చేసే సినిమాలు వేరే లెవల్లో ఉంటాయి. ఆడియన్స్ నా నుండి ఎలాంటి కథలు కోరుకుంటున్నారో అలాంటి సినిమాలు తీస్తా. ఆడియన్స్ కు మెంటలెక్కిపోవాలి అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుతం విశ్వక్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక గామి సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో విశ్వక్ మనుషుల స్పర్శ తాకితే చనిపోయే వ్యాధితో భాధపడుతుంటారు. ఆ వ్యాధి నివారణ కోసం ఒక మనిషి చేసే ప్రయాణమే గామి సినిమా. మరి సరికొత్త కథ, కథనంతో వస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి.