శ్రీలీలలా మీరెందుకు ఫేమస్ అవలేదు.. ఘాటుగా స్పందించిన అంజలి

శ్రీలీలలా మీరెందుకు ఫేమస్ అవలేదు.. ఘాటుగా స్పందించిన అంజలి

సాధారణంగా ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు మన పెద్దలు. కానీ తెలుగమ్మాయి అంజలి(Anjali) విషయంలో మాత్రం దానికి రివర్స్ గా జరిగింది. నటిగా తమిళంలో ప్రూవ్ చేసుకున్నాక తెలుగులో అవకాశాలు దక్కిచుకుంది ఈ బ్యూటీ. షాపింగ్ మాల్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అంజలికి జర్నీ సినిమాతో బ్రేక్ వచ్చింది. ఆ సినిమా సాధించిన విజయంతో తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంది. అందులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మసాలా, గీతాంజలి వంటి హిట్టు సినిమాళ్లు ఉన్నాయి. 

తాజాగా ఆమె నటుస్తున్న మూవీ గీతాంజలి మళ్ళీ వచ్చింది. 2014లో వచ్చిన సూపర్ హిట్ మూవీ గీతాంజలికి ఇది సీక్వెల్. శివ తుర్లపాటి తెరకెక్కిస్తున్న ఈ హారర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ను కోన వెంకట్,  ఎం.వి.వి. సత్యనారాయణ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో భాగంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కారక్రమంలో ఓ లేడీ రిపోర్టర్ హీరోయిన్ అంజలికి కోపం తెప్పించారు. ప్రెస్ మీట్ లో భాగంగా ఆ రిపోర్టర్.. నేను మీకు అభిమానిని, తెలుగమ్మాయి అవ్వడం వల్లే ఇప్పటివరకు మీకు సరైన బ్రేక్ రాలేదని అనిపించిందా? అని అడిగారు. ఆ ప్రశ్నకి కాస్త నొచ్చుకున్న అంజలి.. నాకు బ్రేక్ రాకపోతే మీరు నా అభిమాని ఎలా అయ్యారు.  తెలుగులో ఎక్కువగా చేయకపోవచ్చు.. కానీ, తమిళంలో చేస్తూనే ఉన్నాను.. అంటూ స్ట్రెయిట్ గా చెప్పేశారు. 

అంతటితో ఆగకుకండా మళ్ళీ మైక్ అందుకున్న ఆ రిపోర్టర్.. శ్రీలీల కూడా తెలుగు అమ్మాయే కానీ, ఆ రేంజ్ లో మీరు ఎందుకు సక్సెస్ అవ్వలేకపోయారు.. అని ప్రశ్నించారు. దాంతో సహనం కోల్పోయిన అంజలి కాస్త ఘాటుగానే స్పందించారు.. ఈ నెంబర్ గేమ్స్ నాకు తెలియదు. పట్టించుకోను కూడా. నాకు నచ్చిన పాత్రలే చేస్తున్నాను. అయినా నేనెప్పుడూ ఖాళీగా లేను. బిజీగా సినిమాలు చేస్తూనే ఉన్నాను.. అంటూ బదులిచ్చారు అంజలి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.