డాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనివర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో.. హీరోయిన్‌‌గా కియారా అద్వానీ

డాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనివర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో.. హీరోయిన్‌‌గా కియారా అద్వానీ

షారుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాన్ హీరోగా వచ్చిన డాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2 చిత్రాలు ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకున్నాయో తెలిసిందే. ఆ రెండు చిత్రాలను తీసిన దర్శకుడు ఫర్హాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అక్తర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఈ ఫ్రాంచైజీలో మూడో సినిమా చేస్తున్నాడు. అయితే ఈసారి షారుక్​ ఖాన్ స్థానంలో రణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వీర్ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నటించబోతున్నాడు. తాజాగా ఇందులో హీరోయిన్‌‌గా కియారా అద్వానీని ఫైనల్ చేశారు. ఈ విషయాన్ని ఫర్హాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అక్తర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియా ద్వారా రివీల్ చేశాడు. ‘డాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనివర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి స్వాగతం’ అంటూ ఓ వీడియోను షేర్ చేశాడు. 

రణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి నటించడం కియారాకు ఇదే ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. ‘డాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’లో షారుక్ ఖాన్, ప్రియాంక జోడీ మెప్పించడంతో, ఇప్పుడు రణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వీర్, కియారా జంటపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఆగస్టు నుంచి సెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పైకి వెళ్లనున్నట్టు సమాచారం. ఇందులో ఇమ్రాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హష్మీ విలన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటిస్తాడనే ప్రచారం జరుగుతోంది. ఇక ప్రస్తుతం రామ్ చరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న ‘గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఛేంజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ చిత్రంలో కియారా హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటిస్తోంది. అలాగే హృతిక్, ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నటిస్తున్న ‘వార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2’లోనూ ఆమె నటించనుంది.