Krithi Shetty: అరడజను అవకాశాలొచ్చిన బేబమ్మకు ఏమైంది? ఇక అంతేనా!

Krithi Shetty: అరడజను అవకాశాలొచ్చిన బేబమ్మకు ఏమైంది? ఇక అంతేనా!

ఉప్పెన బ్యూటీ బేబమ్మకు బ్యాడ్ టైం నడుస్తోంది. ఫస్ట్ సినిమా బ్లాక్ బస్టర్ పడితే కెరీర్ జెట్ స్పీడ్లో వెళ్తుంది. సరిగ్గా అలాగే కృతిశెట్టి(Krithi Shetty)కి కూడా వరుసగా అరడజను అవకాశాలొచ్చాయి. కాదనకుండా అన్నింటినీ చేస్తూ వెళ్లింది. వాటిలో హిట్ అయిన సినిమాల కన్నా ఫ్లాప్స్ ఎక్కువ.

ది వారియ‌ర్‌, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, క‌స్ట‌డీ చిత్రాల రూపంలో కృతి శెట్టి బ్యాక్ టు బ్యాక్ ప‌రాజ‌యాల‌ను మూట‌గ‌ట్టుకుంది. దీంతో ఫ్లాప్ హీరోయిన్గా ముద్ర పడిపోయింది. హీరోయిన్స్ కెరీర్ వారి టాలెంట్ మీద ఆధారపడి ఉంటాయన్నది ఎంత నిజమే ఎంతో కొంత లక్ మీద కూడా డిపెండ్ అవుతాయన్నదీ అంతే నిజం. బేబమ్మ కి ఈమధ్య బ్యాడ్ లక్ నడుస్తోంది. అవకాశాలు లేక ఖాళీగా ఉంటోందీ మంగుళూరి భామ.

ప్రస్తుతం ఈ అమ్మడు శర్వానంద్ 35 సినిమాలో మాత్రమే నటిస్తుంది. ఈ సినిమా తర్వాత తెలుగు సినిమా ఆఫర్ ఒక్కటి కూడా లేదు. కోలీవుడ్ లో విగ్నేష్ శివన్ డైరెక్షన్ లో LIC మూవీ చేస్తోంది. అవకాశాల కోసం ఈమధ్య గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఫోటో షూట్ చేస్తూ గ్లామర్ పాత్రలకూ ఓకే అంటూ హింట్ ఇస్తోంది. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదట.  రెమ్యునరేషన్ కూడా అటు ఇటుగా తీసుకుందాం ముందు సినిమాలు దక్కించుకోవాలని తన మేనేజర్ తో కూడా అంటుందట. పాపం బేబమ్మ..!