Mrunal Thakur: మృణాల్ గ్లామర్ షోకి..కుర్రాళ్లు ఫిదా

Mrunal Thakur: మృణాల్ గ్లామర్ షోకి..కుర్రాళ్లు ఫిదా

సీతారామం సినిమాతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur ). ఈ చిత్రంలో సీతగా మృణాల్ యాక్టింగ్‌కు అందరూ ఫిదా అయ్యారు. ఈ సినిమా తరువాత బాలీవుడ్ లోనూ ఈమెకు అవకాశాలు వచ్చాయి. మృణాల్ హీరోయిన్ నటించిన హాయ్ నాన్న చిత్రం రీసెంట్ గానే విడుదలైంది. ఈ సినిమాలో నాని హీరోగా నటించాడు. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్న ఈ నటి..సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటోంది. 

మృణాల్ ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటోంది. లేటెస్ట్గా మృణాల్ టైట్ ఫిట్లో తన మత్తెక్కించే చూపులతో యువతను ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. ప్రస్తుతం మృణాల్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.

ఇకపోతే మృణాల్ ప్రస్తుతం బాలీవుడ్లో వరుస పెట్టి చిత్రాల్లో నటిస్తోంది. ఇటు సౌత్ లోనూ జోరుగా ఆఫర్లు అందుకుంది. తెలుగులో ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తోంది. అలాగే తమిళ స్టార్ శివ కార్తీకేయ అప్ కమింగ్ సినిమాతో కోలీవుడ్ కూ ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం.